Site icon NTV Telugu

Hong Kong Sixes 2025: టీమిండియా కెప్టెన్గా దినేష్ కార్తీక్.. అలా ఎలా అంటే?

Karthik

Karthik

Hong Kong Sixes 2025: భారత మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ రాబోయే హాంకాంగ్ సిక్సర్స్ (Hong Kong Sixes) టోర్నమెంట్ కోసం టీమ్‌ ఇండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యారు. టోర్నమెంట్ నిర్వాహకులు ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 7 నుండి ప్రారంభమయ్యే ఈ షార్ట్ ఫార్మాట్ టోర్నమెంట్లో ఆయన కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విస్తృత అనుభవం, కచ్చితమైన నాయకత్వ నైపుణ్యాలు, అలాగే బ్యాటింగ్‌ స్టైల్‌తో కార్తీక్ అభిమానులకు ప్రేరణగా నిలుస్తారని నిర్వాహకులు భావిస్తున్నారు.

BSNL FTTH: తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ నుండి అతి తక్కువ ధరకు FTTH ట్రిపుల్ ప్లే సేవలు ప్రారంభం..

కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కార్తీక్ మాట్లాడుతూ.. హాంకాంగ్ సిక్సర్స్ వంటి చరిత్ర ఉన్న టోర్నమెంట్‌లో టీమ్‌ ఇండియాను నడిపించడం నాకు గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. అద్భుతమైన రికార్డులు కలిగిన సహచర ఆటగాళ్లతో కలిసి అభిమానులకు సంతోషాన్ని పంచేలా.. వినోదాత్మకంగా క్రికెట్ ఆడేందుకు ఎదురు చూస్తున్నానని తెలిపారు.

Katrina Kaif – vicky kaushal: బేబీ బంప్‌ ఫొటోతో.. గుడ్‌న్యూస్‌ చెప్పిన బాలీవుడ్ స్టార్ కపుల్

మరోవైపు క్రికెట్ హాంకాంగ్ చైనా చైర్‌పర్సన్ బుర్జీ ష్రాఫ్ మాట్లాడుతూ.. దినేష్ కార్తీక్‌ను ఇండియా కెప్టెన్‌గా ఆహ్వానించడం మాకు ఆనందం కలిగిస్తోందని అన్నారు. ఆయన అనుభవం, నాయకత్వం మ్యాచ్ లకు అద్భుత విలువను జోడిస్తాయన్నారు. ఆయన నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించి, ఈ క్రికెట్ పండుగను మరింత వైభవంగా మార్చుతుందని మేము నమ్ముతున్నామని పేర్కొన్నారు.

Exit mobile version