బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నారని అధికారికంగా వెల్లడించారు. కత్రినా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుని, వారి జీవితంలో కొత్త, అందమైన అధ్యాయం ప్రారంభమవుతుందని అభిమానులకు తెలియజేశారు. కొన్ని సంవత్సరాల ప్రేమ ప్రయాణం అనంతరం, కత్రినా.. విక్కీ 2021లో వివాహం చేసుకున్నారు. అప్పటినుండి కత్రినాకు తల్లి కావడం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి. ఆమె కొన్ని సందర్భాల్లో లూజ్ వస్త్రధారణలో ఫోటోలు పంచుకున్నప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఈ జంట పలు ఇంటర్వ్యూలో, “ఇలాంటి శుభవార్త ఉంటే మేమే స్వయంగా మీతో పంచుకుంటాం. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే ఈ విషయాన్ని వెల్లడిస్తాం” అని వెల్లడించారు. ఇప్పుడు మొత్తానికి వారు అధికారికంగా ఈ వార్త పంచడంతో, అభిమానులు, సినీ ప్రముఖులు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Also Read : Mirai : రిలీజ్ టైమ్ లో మిస్ అయిన సర్ప్రైజ్.. నేటి నుంచి స్పెషల్ ట్రీట్
కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు ‘మల్లీశ్వరి’ సినిమాతో పరిచయమయ్యారు. వెంకటేశ్ హీరోగా నటించిన ఈ చిత్రం ద్వారా ఆమె టాలీవుడ్‌లో ప్రవేశించింది. తర్వాత, బాలకృష్ణ కథానాయకుడిగా రూపొందిన ‘అల్లరి పిడుగు’ లో తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత విజయ్ సేతుపత్తో కలిసి నటించిన ‘మెర్రీ క్రిస్మస్’లో కూడా ప్రేక్షకులను మెప్పించారు. ఈ ప్రాజెక్ట్‌ల తరువాత కొన్ని సంవత్సరాల పాటు కొత్త సినిమాలను ఆమె ఎంచుకోలేదు.