MS Dhoni: ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్.. ఎంఎస్ ధోనీకి దక్కని చోటు!
- దినేష్ కార్తీక్ ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్
- ఎంఎస్ ధోనీకి దక్కని చోటు
- 12వ ఆటగాడిగా హర్భజన్ సింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dinesh Karthik’s All-Time India XI : 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత మాజీ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ దినేష్ కార్తీక్ తన ఆల్‌టైమ్ ఇండియా ఎలెవన్‌ను ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన భారత ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేశాడు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించిన ఏకైక కెప్టెన్ అయిన ఎంఎస్ ధోనీకి జట్టులో డీకే చోటివ్వకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. తన జట్టుకు వికెట్ కీపర్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌ను ఎంచుకున్నాడు. ఇక 12వ ఆటగాడిగా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌ను తీసుకున్నాడు.
దినేశ్ కార్తీక్ తన ఆల్‌టైమ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు స్పెషలిస్ట్ బ్యాటర్లు, ఇద్దరు ఆల్‌రౌండర్లు, ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లకు అవకాశం ఇచ్చాడు. వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా ఎంచుకున్న డీకే.. రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్‌లను మిడిలార్డర్ బ్యాటర్లుగా తీసుకున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన కార్తీక్.. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లేలకు జట్టులో చోటిచ్చాడు. జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రాలను పేస్ కోటాలో అవకాశం కల్పించాడు.
Also Read
- Mehbooba Mufti: 'దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం'.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
- Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
- Salman Khan: విద్యార్థులు ఇంటికెళ్లిపోండి.. సోనమ్‌కు ఇంటి భోజనం పంపిస్తా.. సల్మాన్ ఖాన్ ఆసక్తికర ట్వీట్
- Kusha Missile: కుశ మిస్సైల్ సక్సెస్.. భారత అమ్ములపొదిలో మరో అస్త్రం..
క్రిక్‌బజ్‌తో ఒక ఇంటరాక్షన్‌లో దినేష్ కార్తీక్ మాట్లాడుతూ తన ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ప్రస్తుతం భారత జట్టు ప్రధాన కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను కూడా డీకే పక్కన పెట్టాడు. గంభీర్ లాంటి చాలా మంది ఆటగాళ్లకు జట్టులో చోటివ్వకపోవడం బాధగా ఉందని డీకే పేర్కొన్నాడు. అయితే మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ అండ్ బ్యాటర్ అయిన ఎంఎస్ ధోనీకి చోటు ఇవ్వకపోవడంతో డీకేపై అభిమానులు అందిపడుతున్నారు.
దినేశ్ కార్తీక్ ఇండియా ఆల్‌టైమ్ ఎలెవన్:
వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అనిల్ కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, జహీర్ ఖాన్. (హర్భజన్ సింగ్-12వ ఆటగాడు)
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్‌పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్‌నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?