డింపుల్ హయతి.. ఈ పేరుకు పెద్దగా అక్కర్లేదు.. అందమైన ఆకృతి, డ్యాన్స్ అన్ని ఉన్నా కూడా పెద్దగా ఆఫర్స్ లేని హీరోయిన్లలో డింపుల్ హయతి కూడా ఒకరు.. డింపుల్ హయాతి కెరీర్ అంతగా బాగోలేదు. ఆమెకు ఆఫర్స్ వస్తున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు.రవితేజకు జంటగా ఖిలాడి చిత్రం చేయగా నిరాశపరిచింది. లేటెస్ట్ రిలీజ్ రామబాణం మరో డిజాస్టర్ అయ్యింది. అలాగే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి.. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా అదిరిపోయే స్టిల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. అవి కాస్త ట్రెండ్ అవుతున్నాయి..
ఈ అమ్మడు గద్దలకొండ గణేష్ చిత్రంలో స్పెషల్ సాంగ్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకి నృత్యంలో ప్రత్యేక ప్రావీణ్యం ఉంది. అందుకే సాంగ్స్ లో డింపుల్ రెచ్చిపోయి డ్యాన్స్ చేయడం చూస్తూనే ఉన్నాం.. డింపుల్ హయతి గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. డింపుల్ హయతి ప్రస్తుతం టాలీవుడ్ లో కుర్రాళ్లకు కొత్త కలల రాణిగా మారిపోతోంది.. హీట్ పెంచే అందం ఉన్నా హిట్ కోసం వెయిట్ చేస్తుంది..
సినిమాల తో పాటుగా వివాదాలు కూడా ఆమెను వార్తల్లో నిలిచేలా చేశాయి.. ఎప్పుడూ ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తుంది.. ఇక సినిమాల విషయానికొస్తే.. గోపిచంద్ సరసన రామ బాణం సినిమాలో నటించింది.. ఆ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు.. ఇప్పుడు మరో సినిమా కోసం వెయిట్ చేస్తుంది.. ఎందుకు అందాలను వెస్ట్ చెయ్యడం అనుకుందేమో హాట్ స్టిల్స్ తో అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తుంది..