Dilshan Madushanka Ruled Out of initial stages of IPL 2024: ఐపీఎల్ 2024 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముంబై బౌలర్, శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ దిల్షాన్ మధుశంక గాయం బారిన పడ్డాడు. మధుశంక ప్రస్తుతం తొడ కండరాల గాయంతో బాధపడతున్నాడు. గాయం కారణంగా అతడు ఐపీఎల్ 17వ సీజన్ మొదటి దశకు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గత ఐపీఎల్ వేలంలో మధుశంకను ముంబై రూ.4.6 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వన్డే ప్రపంచకప్ 2023లో అద్బుతమైన ప్రదర్శన చేయడంతో ముంబై అతడికి భారీ ధరను వెచ్చించింది.
ఛటోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. దాంతో ఆట మధ్యలోనే అతడు మైదానాన్ని వీడాడు. 6.4 ఓవర్లు మాత్రమే మధుశంక బౌలింగ్ చేశాడు. మధుశంకను ఆస్పత్రికి తరలించి.. స్కాన్ చేయగా గాయం తీవ్రమైనది స్పష్టం అయింది. దాంతో బంగ్లాతో ఈరోజు జరిగే మూడో వన్డేకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ ధ్రువీకరించింది. మధుశంక గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 17వ సీజన్ ఫస్ట్ హాఫ్‌కు అతడు దూరమయ్యే అవకాశం ఉంది.
Also Read: Ellyse Perry: ఎలీస్ పెర్రీకి ఊహించని బహుమతి.. పగిలిన కారు అద్దాన్ని..!
ముంబై ఇండియన్స్ ఇప్పటికే గెరాల్డ్ కోయెట్జీ సేవలు కోల్పోయింది. గాయపడిన అతడు మొదటి దశకు దూరం కానున్నాడు. ప్రస్తుతం అతడు ముంబై వైద్యబృందం సమక్షంలో కోలుకుంటున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, నువాన్ తుషారలు ముంబైకి అందుబాటులో ఉన్నారు. ఈ సీజన్‌లో ముంబైకి హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ముంబై తన తొలి మ్యాచ్‌లో మార్చి 24న గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది.