DilRaju: దిల్ రాజు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80శాతం సక్సెస్ అయినవే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు. దిల్ రాజు బ్యానర్లో పరిచయమైన వారు ఎంతో మంది హీరోలుగా, దర్శకులుగా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నారు. దిల్ రాజుకి ప్రస్తుతానికి వారసులు లేకపోవడంతో ఈయన ఫ్యామిలీ నుంచి హీరోలు ఎవరు రాలేదు. దీంతో దిల్ రాజుకి వారసుడుగా తన మేనల్లుడైన ఆశిష్ ను రౌడీ బాయ్స్ సినిమాతో ఎంట్రీ ఇప్పించాడు.
Read Also:Pawan Kalyan: బాక్సాఫీస్ పై OG బుల్లెట్ల వర్షం… రీఎంట్రీ తర్వాత ఇదే ఫస్ట్ టైం
ఎంతో మంది వారసులకు తొలి సినిమాతోనే హిట్ ఇచ్చిన దిల్ రాజ్ తన ఫ్యామిలీ హీరోకు మాత్రం ‘రౌడీ బాయ్స్’ తో సక్సెస్ అందించలేకపోయాడు. భారీ ప్రమోషన్స్, బడ్జెట్‌తో తెరకెక్కించినా కథలో కొత్తదనం లేకపోవడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడింది. ప్రస్తుతం ఆశిష్ ‘సెల్ఫిష్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ లవ్ స్టోరీ సెట్స్‌పై ఉండగానే ఆశిష్‌కి 3వ సినిమాను సెట్ చేశాడు. సోమవారం పూజా కార్యక్రమంతో ఆశిష్ థర్డ్ మూవీ మొదలైంది. హారర్ లవ్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాతో అరుణ్ డైరెక్టర్ టాలీవుడ్‌కి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎమ్ఎమ్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా ఆటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.
Read Also:Chiranjeevi – UV Creations : మరి కాసేపట్లో రానున్న చిరంజీవి కొత్త సినిమా ప్రకటన..
దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. త్వరలోనే ఆశిష్ హర్రర్ మూవీ షూటింగ్ మొదలు కాబోతున్నట్లు సమాచారం. కాగా ఆశిష్ హీరోగా నటిస్తున్న ‘ సెల్ఫిష్ ‘ సినిమాకు సుకుమార్ శిష్యుడు కాశి విశాల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ఇనాయా సుల్తానా హీరోయిన్‌గా నడుస్తుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఇనాయా సుల్తానా హీరోయిన్‌గా నడుస్తుంది. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాతో ఆశిష్ కి ఎలాగైనా మార్కెట్ ఓపెన్ అవ్వాలనే దిశగా దిల్ రాజు ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో కలగజేసుకుంటున్నరంట.
