పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ ఫ్యాన్ సుజిత్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘They Call Him OG’. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా OGనే అందుకే అన్ని ఇండస్ట్రీల మర్కెట్స్ ని టార్గెట్ చేస్తూ ఈ మూవీలో సౌత్ నుంచి అర్జున్ దాస్, నార్త్ నుంచి ఇమ్రాన్ హష్మీని కాస్ట్-ఇన్ చేసారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న OG సినిమా ఇప్పటికే 50% షూటింగ్ కంప్లీట్ చేసుకొని, ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అనౌన్స్మెంట్ నుంచే OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి, ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ని ఇస్తూనే ఉన్నారు. దీంతో OG సినిమాపై అభిమానుల్లోనే కాకుండా రెగ్యులర్ మూవీ లవర్స్ లో కూడా ఇంట్రెస్ట్ పెరిగింది. అనౌన్స్మెంట్ నుంచే పంజా వైబ్స్ ఇస్తున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాక్సాఫీస్ షేప్ షకల్ మారిపోవడం గ్యారెంటీ అనే నమ్మకం అందరిలోనూ ఉంది.
నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నెలని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న OG గురించి లేటెస్ట్ ఇంఫార్మేషన్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ షూటింగ్ కి రెడీ అవుతున్న పవన్ కళ్యాణ్, ఈ మ్యాజివ్ షెడ్యూల్ అయిపోగానే OG కోసం 30 రోజుల కాల్ షీట్స్ కేటాయించాడట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్, ఒక సినిమాకి ఇన్ని బల్క్ డేట్స్ ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇది మాత్రమే కాదు OG ప్రీ క్లయిమాక్స్ ఎపిసోడ్స్ షూటింగ్ కోసం పవన్ కళ్యాణ్ బ్యాంగ్కాక్ కూడా వెళ్తున్నాడు. రీఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ తన సినిమా షూటింగ్ కోసం ఫారిన్ కి వెళ్లడం లేదు. అలాంటిది OG కోసం దేశం దాటుతున్నాడు అంటే పవన్ కి OGపై ఎంత నమ్మకం ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఆ నమ్మకాన్ని సుజిత్ ఎలా నిలబెట్టుకున్నాడు అనే ప్రశ్నకి సమాధానం సెప్టెంబర్ 2న వస్తుంది.