NTV Telugu Site icon

Duck Outs: క్రికెట్లో ఎన్ని రకాల ‘డక్ ఔట్స్’ ఉన్నాయో తెలుసా.. వివరాలు ఇలా..

Duckouts

Duckouts

ప్రస్తుతం భారతదేశంలో ఎన్నికల హడావిడి ఒకవైపు జరుగుతుండగా., మరోవైపు.. ఐపీఎల్ 17 సీజన్ జరుగుతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ సీజన్ చివరి దశకు చేరుకుంటుంది. ఆదివారం నాడు ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పరుగులు ఏమి చేయకుండా గోల్డెన్ డక్ అవుట్ గా వినతిగాడు. హర్ష ల్ పటేల్ బౌలింగ్ లో ధోని క్లీన్ బోల్డ్ కావడంతో గోల్డెన్ డక్ గా పెవిలియన్ చేరాడు. ఇకపోతే ఈ నేపథ్యంలో చాలా మందిని నెటిజెన్స్ అసలు గోల్డెన్ డక్ అంటే ఏంటి..? అసలు ఎన్ని రకాల డక్ ఔట్స్ ఉన్నాయి..?0 అంటూ తెగ గూగుల్ సెర్చ్ చేసేస్తున్నారు.

Also Read: Swathi: కలర్స్ స్వాతిని ‘ఛీ.. నీ బతుకు.. ‘ అంటూ మెసేజ్.. రిప్లై గట్టిగా ఇచ్చిందిగా..

అసలు గోల్డెన్ డక్ అవుట్ అంటే ఏంటి..? అలాగే ఎన్ని రకాల డక్ ఔట్లు ఉన్నాయో.. మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో భాగంగా మొదటగా బ్యాట్స్మెన్ తాను ఎదుర్కొన్న మొదటి బంతికే పరుగులు ఏమి చేయకుండా అవుట్ అయితే దానిని ‘గోల్డెన్ డక్ అవుట్’ అంటారు. అలాగే బ్యాట్స్మెన్ తాను ఎదుర్కొన్న రెండో బంతికి పరుగులు ఏమి చేయకుండా అవుట్ అయితే దాన్ని ‘సిల్వర్ డక్ అవుట్’ అంటారు.

Also Read: Arya: నా జీవితాన్నే మార్చేసిన సినిమా.. ఎమోషనలైన బన్నీ..

అలాగే బ్యాట్స్మెన్ మూడో మందికి పరుగులు ఏమి చేయకుండా అవుట్ అవుతే దాన్ని ‘బ్రాంచ్ డకౌట్’ అంటారు. ఇక చాలా అరుదైన సందర్భంలో డైమండ్ డక్ ఔట్ కూడా అవుతుంటారు. అసలు ఈ డైమండ్ అకౌంట్ అంటే.. బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి వచ్చిన తర్వాత అతడు ఎటువంటి బంతిని ఎదుర్కోకోకపోయినా గాని అవుట్ అయితే దాన్ని ‘డైమండ్ డక్ అవుట్’ అంటారు. ఇలాంటి డక్ ఔట్స్ ఎక్కువగా రన్ అవుట్స్ విషయంలో జరుగుతుంటాయి.