NTV Telugu Site icon

Kurnool: కర్నూలు జిల్లా కూటమిలో చల్లారని మంటలు

Kurnool

Kurnool

Kurnool: కర్నూలు జిల్లా కూటమిలో మంటలు చల్లారడం లేదు. కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మిగనూరు, మంత్రాలయంలో టీడీపీతో మిత్రపక్షాలు ఢీకొట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి జయనాగేశ్వర్‌ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ, జనసేన మద్దతుతో మురహరి రెడ్డి నామినేషన్ వేశారు. జయనాగేశ్వర్‌రెడ్డి బీజేపీకి ఓట్లు ఎక్కడ ఉన్నాయని అవమానించారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. కూటమి నేతల తీరుతో కేడర్‌ అయోమయ స్థితిలో పడింది.

Read Also: Ayodhya: అయోధ్య వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ సౌకర్యాన్ని పునరుద్ధరించిన ఆలయ ట్రస్ట్..

మరోవైపు రేపు లేదా ఈ నెల 25న మంత్రాలయం బీజేపీ అభ్యర్థిగా మేరీమాత అనే దళిత మహిళతో నామినేషన్‌ వేయించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రాలయంలో టీడీపీ అభ్యర్థిగా రాఘవేందర్‌ రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా బాలనాగిరెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ దళిత మహిళను పోటీ చేయించి బీజేపీ సత్తా చూపిస్తామని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. టీడీపీ, బీజేపీ పక్షాల మధ్య వైరుధ్యం ఉన్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎమ్మిగనూరులో చంద్రబాబు ప్రజాగళం సభకు బీజేపీ నేతలను ఆహ్వానించకపోవడాన్ని అవమానంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

Show comments