Shell India: వాహనదారులకు షెల్ ఇండియా షాక్.. డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు

  • వాహనదారులకు షెల్ ఇండియా షాక్
  • డీజిల్ ధర రూ. 25, పెట్రోల్ ధర రూ. 7.41 పెంపు
  • రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.119.85 కాగా, ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.129.85గా ఉంది
Shell India

Shell India

వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. బెంగళూరులో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7.41 మేర పెరిగాయి. ఫలితంగా, ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.119.85 కాగా, ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.129.85గా ఉంది. ఇరాన్ సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచినట్లు వర్గాలు తెలిపాయి.

Also Read:Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు పెట్టిన కొత్త కోడలు.. నగదు, నగలతో పరార్

నయారా ఎనర్జీ ఇటీవల పెట్రోల్ ధరలను లీటరుకు రూ.5, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 పెంచింది. పశ్చిమ ఆసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ చమురు ధరలలో వచ్చిన భారీ పెరుగుదల భారాన్ని కొంతమేర వినియోగదారులపై మోపడానికి ఈ పెంపు జరిగింది. భారతదేశంలోని మొత్తం 1,02,075 పెట్రోల్ పంపులలో 6,967 పంపులను నిర్వహిస్తున్న నయారా ఎనర్జీ, పెరిగిన ముడిసరుకు ఖర్చులలో కొంత భాగాన్ని వినియోగదారులపై మోపాలని నిర్ణయించుకుందని రెండు వర్గాల సమాచారం మేరకు వార్తా సంస్థ పీటీఐ పేర్కొంది.