Site icon NTV Telugu

PM Modi: కనీసం ‘మహదేవ్’ని కూడా వదలడం లేదు.. కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ ఫైర్..

Pm Modi

Pm Modi

PM Modi: ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నేత, సీఎం భూపేష్ బఘేల్ ‘మహదేవ్ బెట్టింగ్ యాప్’లో ఇరుకున్నారు. యాప్ ప్రమోటర్ల నుంచి బఘేల్‌కి రూ. 508 కోట్లు అందినట్లు ఈడీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఈ వివాదం రాజకీయం ప్రాముఖ్యతను పెంచింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ని ఉటంకిస్తూ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్రమ డబ్బును తరలిస్తున్న కొరియర్ని ఈడీ పట్టుకోవడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని ఏజెన్సీ పేర్కొంది.

రాబోయే రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి నిధులు సమకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీ అక్రమ డబ్బును ఉపయోగిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్రమోడీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పరమశివుడి నామమైన ‘మహాదేవ్’ని కూడా కాంగ్రెస్ పార్టీ వదలడం లేదని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ, ఛత్తీస్గడ్ ప్రభుత్వం ప్రజల్ని దోచుకోవడానికి ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టదు, వారు మహదేశ్ పేరును కూడా వదిలిపెట్టలేదు’’ అని దుర్గ్ లో జరిగిన ర్యాలీలో ప్రధాని అన్నారు.

Read Also: Heart Attack: 9వ తరగతి బాలికకు గుండెపోటు.. పరీక్షా హాలులోనే మృతి

గురువారం ఈడీ ఛత్తీస్గడ్ లో జరిపిన దాడుల్లో రూ. 5 కోట్లతో కొరియర్ పట్టుబడ్డాడు. ఈ డబ్బును బఘేల్ అనే రాజకీయ నాయకుడికి ఇవ్వాల్సి ఉందని ఈడీ ముందు సదరు కొరియర్ ఒప్పుకున్నారు. ఈ కేసులో మహాదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్లు సీఎం బఘేల్‌కి రూ. 508 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిందితులందరిపై చర్యలు తీసుకుంటామని ప్రధాని మోడీ వెల్లడించారు. ప్రతీపైనాను వారి నుంచి తీసుకుంటాం, ఇలాంటి స్కాములపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడుతలుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఓటింగ్ జరగనుంది.

Exit mobile version