కాంగ్రెస్ ఎంపీ, అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ హయాంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ‘జన్ ఆశీర్వాద్ యాత్ర’ నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా తాలెన్, సారంగ్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన విమర్శల దాడికి దిగారు.
IND vs BAN: రాణించిన బంగ్లా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?
కాంగ్రెస్ నేతలు 2018 ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలు మరిచారని.. తమ ప్రభుత్వం వస్తే పది రోజుల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. ఇప్పటికీ 15 నెలలు గడిచాయి.. ఎలాంటి రుణమాఫీ చేయలేదన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లభ్‌భవన్‌ను అవినీతి గూడగా చేసి మధ్యప్రదేశ్‌ను మళ్లీ జబ్బుపడిన రాష్ట్రంగా మార్చే పని చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో కమల్ నాథ్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత.. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో మధ్యప్రదేశ్ దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో అగ్రగామిగా ఉందని సింధియా చెప్పారు.
Keedaa Cola: ‘కీడా కోలా’ కొట్టేందుకు టైం ఫిక్స్ అయింది!
2003 వరకు మధ్యప్రదేశ్‌లో 56 ఏళ్ల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉందని.. రాష్ట్రాన్ని జబ్బుపడిన రాష్ట్రంగా మార్చిందని సింధియా అన్నారు. కాంగ్రెస్ హయాంలో కరోనా మహమ్మారి సంభవించినప్పుడు ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రికి సమయం లేదన్నారు. అతను IIFA అవార్డ్స్ (సినిమా పరిశ్రమ యొక్క అవార్డు వేడుక) కోసం ఇండోర్ వెళ్ళాడని తెలిపారు. కరోనా కాలంలో ప్రజలకు సహాయం చేయడానికి బీజేపీ కష్టపడి పనిచేసిందని పేర్కొన్నారు. ఆక్సిజన్ సిలిండర్లను తీసుకురావడానికి ప్రధాని మోడీ హెర్క్యులస్ విమానాన్ని రాయ్‌పూర్‌కు పంపారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ఉండి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ హయాంలో దేశం విదేశాల ముందు అడుక్కోవాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు మనమే కరోనా వ్యాక్సిన్స్ ఇచ్చేంత ఎదిగామన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో కరోనా వ్యా్క్సిన్ కనుగొని.. విదేశాలకు సరఫరా చేశామని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ హయాంలో ఒక్క రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరువయ్యేదని.. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి పంపితే మొత్తం రూపాయి లబ్ధిదారుల ఖాతాల్లోకి చేరుతోందని సింధియా తెలిపారు.