Rajamouli : దర్శకుడు అనిల్ రావిపూడిపై ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, అనిల్ రావిపూడి మరియు గోపీచంద్ మలినేని అతిథులుగా హాజరయ్యారు.యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కృష్ణమ్మ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించారు.అయితే తాజాగా జరిగిన కృష్ణమ్మ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఎస్ఎస్ రాజమౌళి మరియు డైరెక్టర్ అనిల్ రావిపూడి మధ్య సరదా సంభాషణ సాగింది.అయితే దర్శక ధీరుడు రాజమౌళి తన తరువాత సినిమా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కబోతుంది.
తాజాగా ఆ సినిమా ఓపెనింగ్ ఎప్పుడో రాజమౌళి గారు చెప్పాలని అనిల్ రావిపూడి అడిగారు.అలాగే దేవర సినిమా గురించి అప్డేట్ కావాలని దర్శకుడు కొరటాల శివను కూడా ప్రశ్నించారు.అయితే రాజమౌళి గురించి మాట్లాడుతూ.ఆయన ఓపెనింగ్ డే రోజున తాను తీసే సినిమా కథ ఎలా ఉంటుంది ఏ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు అనేది చెబుతారు.ఆయన తరువాత సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడో తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఉందని అనిల్ రావిపూడి అన్నారు.దీనితో రాజమౌళి సరదాగా స్పందించారు.. దర్శకుడు అనిల్ రావిపూడిని ఎవరైనా సరే. ఓ కెమెరా పట్టుకొని..వెనకాలే నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి గుద్దేస్తే 10వేలు ఇస్తాను” అని రాజమౌళి సరదాగా అన్నారు.అయితే రాజమౌళి ఇచ్చిన ఆఫర్‌పై అనిల్ రావిపూడి సరదాగా స్పందించారు. “దయచేసి ప్రైజ్‍మనీ తగ్గించండి సర్. ఓ రెండు రూపాయలని చెప్పండి. 10వేలు అంటే నిజంగా వచ్చేస్తారు” అని అనిల్ స్పందించారు.
Also Read
A funny banter between directors #SSRajamouli and #AnilRavipudi about #SSMB29 #SSRMB opening date 🤣🔥
— 𝐁𝐡𝐞𝐞𝐬𝐡𝐦𝐚 𝐓𝐚𝐥𝐤𝐬 (@BheeshmaTalks) May 1, 2024
తాజావార్తలు
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!