NTV Telugu Site icon

Kubera : కుబేర వాయిదా వేసి శేఖర్ కమ్ముల మంచి పని చేశారా ?

Kuberaglimpse

Kuberaglimpse

Kubera : కొన్ని కొన్ని సార్లు చేయాల్సిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయకపోతే అనర్ధానికి కారణం అవుతుందని.. ఆలస్యం అమృతం విషం అనే సామెత చెబుతుంటారు. కానీ ఈ రెండు సినిమాల విష‌యంలో మాత్రం ఆ సామెత నిజమే అని రుజువు అవుతోంది. ఇంత‌కీ అసలు ఏమైందంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తోన్న ‘విశ్వంభ‌ర’ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కానీ అదే స‌మయంలో తన కొడుకు రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజ‌ర్’ కూడా ఉండ‌టంతో తండ్రి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇందులో కొంత వాస్త‌వం ఉంది. కానీ అస‌లు సంగ‌తేంటి? అంటే `విశ్వంభ‌ర` సోషియా ఫాంట‌సీ కావ‌డంతో సీజీ వ‌ర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ప‌నుల‌న్నీ కూడా సంక్రాంతికి పూర్తి చేసి విడుదల చేయాలి. అయితే షూటింగ్ అయితే పూర్తయిందట కానీ సీజీ వర్క్ పెండింగులో ఉండిపోయిందట. పూర్తయిన వరకు కూడా మంచిగా రాలేదట.

Read Also:Lavanya: మళ్ళీ తెర మీదకు రాజ్ తరుణ్ ప్రియురాలు.. ఈసారి అతని భాగోతం బట్టబయలు!!

దీంతో మ‌ళ్లీ బాగాలేని చోట రీ వర్క్ చేశారని సమాచారం. నిజంగా సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంటే గ‌నుక ఆ ప‌నంతా గంద‌ర‌గోళంగానే జ‌రిగేదని తెలుస్తోంది. సీజీ వ‌ర్క్ ఉన్న సినిమాల విష‌యంలో ఎంత వీలైంత ఎక్కువ సమయం తీసుకుంటేనే కూల్ గా పని కంగారు లేకుండా చేసుకోవచ్చు. అవుట్ పుట్ కూడా బాగా వస్తుంది. కంగారుతో చేస్తే క్వాలిటీ ప్రోడ‌క్ట్ రాదు. ల‌క్కీగా గేమ్ ఛేంజ‌ర్ సంక్రాంతి బ‌రిలోకి రావ‌డంతో ద‌ర్శ‌కుడు వ‌శిష్ట వెన‌క్కి త‌గ్గి కూల్ గా ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేస్తే మంచిదని భావించి సమ్మర్ కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అలాగే ధ‌నుష్‌, నాగార్జున హీరోల‌గా న‌టిస్తోన్న ‘కుబేర’ చిత్రాన్ని కూడా స‌క్రాంతికే తీసుకుని రావాలనుకున్నారు. ఆ దిశ‌గా ప‌నులు మొదలు పెట్టారు. కానీ కొంత వ‌ర్క్ జ‌రిగిన త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల ఎందుకు తొంద‌ర ప‌డ‌డం అని వెనక్కి తగ్గారట‌. ఆ తేదీ కాక‌పోతే మ‌రో తేదీ కూల్ గా విడుదల చేద్దామని నిర్మాత‌లు కూడా భ‌రోసా ఇవ్వ‌డంతో `కుబేర` కూడా సంక్రాంతి బరి నుంచి తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఇక్క‌డ మ‌రో విష‌యం కూడా గుర్తిచాలి. ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ చేసి టికెట్ ధ‌ర‌లు ఆకాశాన్నంటేలా పెట్టేస్తే విమర్శలు రావడం కామన్. అలా కాకుండా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తే ఆ ర‌క‌మైన ఇబ్బంది ఉండ‌దన్నది శేఖర్ కమ్ముల నిర్మాత‌ల ఆలోచ‌న‌గా వెలుగులోకి వ‌స్తోంది. మొత్తానికి ఇప్పుడు ఇలా సినిమాను వాయిదా వేయడమే మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Read Also:Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం

Show comments