Kubera : కుబేర వాయిదా వేసి శేఖర్ కమ్ముల మంచి పని చేశారా ?
- పెండింగులో విశ్వంభర సీజీ వర్క్
- కూల్ గా అప్పడే రానున్న కుబేర
- సమ్మర్ రిలీజ్ కు రెండు భారీ సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kubera : కొన్ని కొన్ని సార్లు చేయాల్సిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయకపోతే అనర్ధానికి కారణం అవుతుందని.. ఆలస్యం అమృతం విషం అనే సామెత చెబుతుంటారు. కానీ ఈ రెండు సినిమాల విషయంలో మాత్రం ఆ సామెత నిజమే అని రుజువు అవుతోంది. ఇంతకీ అసలు ఏమైందంటే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘విశ్వంభర’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కానీ అదే సమయంలో తన కొడుకు రామ్ చరణ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ కూడా ఉండటంతో తండ్రి వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇందులో కొంత వాస్తవం ఉంది. కానీ అసలు సంగతేంటి? అంటే `విశ్వంభర` సోషియా ఫాంటసీ కావడంతో సీజీ వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ పనులన్నీ కూడా సంక్రాంతికి పూర్తి చేసి విడుదల చేయాలి. అయితే షూటింగ్ అయితే పూర్తయిందట కానీ సీజీ వర్క్ పెండింగులో ఉండిపోయిందట. పూర్తయిన వరకు కూడా మంచిగా రాలేదట.
Read Also:Lavanya: మళ్ళీ తెర మీదకు రాజ్ తరుణ్ ప్రియురాలు.. ఈసారి అతని భాగోతం బట్టబయలు!!
Also Read
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
- Minister Nara Lokesh: స్పీడ్.. సర్వీస్.. స్టెబిలిటీ.. ఏపీ అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
దీంతో మళ్లీ బాగాలేని చోట రీ వర్క్ చేశారని సమాచారం. నిజంగా సంక్రాంతికి రిలీజ్ టార్గెట్ గా పెట్టుకుంటే గనుక ఆ పనంతా గందరగోళంగానే జరిగేదని తెలుస్తోంది. సీజీ వర్క్ ఉన్న సినిమాల విషయంలో ఎంత వీలైంత ఎక్కువ సమయం తీసుకుంటేనే కూల్ గా పని కంగారు లేకుండా చేసుకోవచ్చు. అవుట్ పుట్ కూడా బాగా వస్తుంది. కంగారుతో చేస్తే క్వాలిటీ ప్రోడక్ట్ రాదు. లక్కీగా గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలోకి రావడంతో దర్శకుడు వశిష్ట వెనక్కి తగ్గి కూల్ గా ప్రొడక్షన్ చేసి రిలీజ్ చేస్తే మంచిదని భావించి సమ్మర్ కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అలాగే ధనుష్, నాగార్జున హీరోలగా నటిస్తోన్న ‘కుబేర’ చిత్రాన్ని కూడా సక్రాంతికే తీసుకుని రావాలనుకున్నారు. ఆ దిశగా పనులు మొదలు పెట్టారు. కానీ కొంత వర్క్ జరిగిన తర్వాత శేఖర్ కమ్ముల ఎందుకు తొందర పడడం అని వెనక్కి తగ్గారట. ఆ తేదీ కాకపోతే మరో తేదీ కూల్ గా విడుదల చేద్దామని నిర్మాతలు కూడా భరోసా ఇవ్వడంతో `కుబేర` కూడా సంక్రాంతి బరి నుంచి తొలగిపోయినట్లు తెలుస్తోంది. ఇక్కడ మరో విషయం కూడా గుర్తిచాలి. ఒకేసారి నాలుగు సినిమాలు రిలీజ్ చేసి టికెట్ ధరలు ఆకాశాన్నంటేలా పెట్టేస్తే విమర్శలు రావడం కామన్. అలా కాకుండా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తే ఆ రకమైన ఇబ్బంది ఉండదన్నది శేఖర్ కమ్ముల నిర్మాతల ఆలోచనగా వెలుగులోకి వస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఇలా సినిమాను వాయిదా వేయడమే మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Read Also:Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం
తాజావార్తలు
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!