NTV Telugu Site icon

Dibrugarh Train Accident: రైలు ప్రమాదంలో ఎంత మంది మరణించారంటే..?

Dibrugarh Express Train

Dibrugarh Express Train

యూపీలోని గోండాలో గురువారం మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్‌ నుంచి గోరఖ్‌పూర్‌ మీదుగా అస్సాం వెళ్తున్న దిబ్రూగఢ్‌ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా 27 మందికి పైగా గాయపడినట్లు ఇప్పటివరకున్న సమాచారం. గోరఖ్‌పూర్ రైల్వే సెక్షన్‌లోని మోతీగంజ్ సరిహద్దులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. దెబ్బతిన్న కోచ్‌లలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి రైల్వే హెల్ప్‌లైన్ నంబర్లను కూడా విడుదల చేసింది.

READ MORE: AAP: మిత్రపక్షాల మధ్య విభేదాలు.. హర్యానాలో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదన్న ఆప్

రైల్వే అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. వైద్య బృందాన్ని కూడా రప్పించి కోచ్‌లలో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదం తర్వాత ఆ మార్గంలో వచ్చే రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గురైన రైలు సంఖ్య 15904. మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు. రెండు బోగీలు పూర్తిగా పట్టాలు తప్పాయి. ట్రాక్‌లు కూడా లేచిపోయాయి. ప్రమాదానికి గురైన రైలు నుంచి ప్రజలు అతి కష్టం మీద బయటకు వచ్చారు.

READ MORE:PM Modi: ప్రధాని మోడీ టార్గెట్‌గా కాంగ్రెస్ హింసను ప్రేరేపిస్తోంది..

స్పందించిన సీఎం యోగి …
రైలు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు చుట్టుపక్కల జిల్లాల్లోని అన్ని ఆస్పత్రులు, సీహెచ్‌సీలు, పీహెచ్‌సీలను అలర్ట్‌ మోడ్‌లో ఉంచారు. ఎస్ డీఆర్ఎఫ్ (SDRF) బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. యూపీ ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం పరస్పరం టచ్‌లో ఉన్నాయి. రైలు ప్రమాదంపై సీఎం యోగి విచారం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఎక్స్‌పై పోస్ట్‌లో ఇలా రాశారు, “గోండా జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం చాలా బాధాకరమైనది, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని మరియు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాలని జిల్లా పరిపాలన అధికారులను ఆదేశించాం. వారికి సరైన చికిత్స అందింస్తాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.