గుంటూరులో కలకలం రేపుతోంది. కలుషిత నీరు సరఫరా కావడంతో డయేరియా విజృంభిస్తోంది. గడచిన నాలుగురోజులుగా డయేరియాతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలో చేరుతున్నారు. డయేరియాతో ఒకరు చనిపోగా.. మరో 30 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుంటూరు కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యమే డయేరియా ప్రబలడానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని స్పందించారు. గుంటూరులో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు, అనారోగ్యం బారిన పడ్డారని.. అనారోగ్యానికి గురైన వారందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై క్షేత్ర స్థాయిలో వివరాలు సేకరిస్తున్నామని అన్నారు.
Read Also: Ka Paul: దమ్ముంటే చంద్రబాబు, మోడీ, జగన్ నాపై పోటీ చేయాలి..
గుంటూరు హాస్పిటల్లో మంచి వైద్యం అందుతుందని మంత్రి రజిని తెలిపారు. ప్రజలకు అనారోగ్యం పై కారణాల పై దర్యాప్తు చేస్తున్నామన్నారు. నీరు, ఆహారంకు సంబంధించిన 32 శ్యాంపిల్స్ ను సేకరించారన్నారు. కలెక్టర్, కమిషనర్ నేతృత్వంలో ఘటన పై దర్యాప్తు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. 2018లో గుంటూరులో డయేరియా ప్రబలి తీవ్ర స్థాయిలో ప్రజలు మృత్యువాత పడ్డారని తెలిపారు. ఆ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారని మంత్రి అన్నారు. డయేరియా ప్రభలడం అంటే అది అని అన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం.. ఈ ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటామని మంత్రి చెప్పారు. డయేరియా కోసం హెల్ప్ డెస్క్ నంబర్ కూడా ఏర్పాటు చేశాం.. ప్రజలు అనారోగ్యం బారిన పడితే వెంటనే అధికారులను సంప్రదించవచ్చని మంత్రి విడదల రజిని తెలిపారు.
Read Also: Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాల సాకుతో 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం..