NTV Telugu Site icon

రచయిత సాయి మాధవ్ బుర్రా సంచలనం.. తెలుగువారికి మినహాయించి వారందరికి పాదాభివందనం

Madhav Burra (1)

Madhav Burra (1)

Dialogue Writer Sai Madhav Burra: నేడు జరిగిన తెలుగు దినోత్సవ భాష కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సినీ రచయిత సాయి మాధవ్ బుర్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రంలో ఆయన మాట్లాడుతూ.. అందరికీ తెలుగు దినోత్సవ భాష శుభాకాంక్షలు తెలిపారు. ఇక దర్శకుడు వైవిఎస్ చౌదరి గురించి మాట్లాడుతూ… మీరు హీరో హీరోయిన్లను మాత్రమే కాకుండా నిర్మాతలను కూడా చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తున్నారని ఈ రికార్డు అందరికీ ఉండదని తెలిపారు. నేటి కార్యక్రమం గురించి వైవిఎస్ చౌదరి చెప్పినప్పుడు.. తాను ఎంతగానో ఆశ్చర్యపోయానని.. ఒక సినిమా ప్రొడక్షన్ వారు కార్యక్రమం పెట్టారంటే.. ఏదైనా సక్సెస్ మీట్ అయినా., లేకపోతే ఫ్రీ రిలీజ్ ఫంక్షన్, టీజర్ లాంచింగ్ లాంటివి పెడుతుంటారు. ఇవన్నీ కాక తెలుగు భాష దినోత్సవం అని చెప్పినప్పుడు నిజంగా ఆనందం వేసిందని తెలిపారు. ఇవాల్టి రోజుల్లో ఓ ప్రోడక్షన్ టీం ఇలా తెలుగు దినోత్సవాన్ని జరుగుతుందంటే మీకు హ్యాట్సాఫ్ అంటూ తెలియజేశారు. ఇక స్టేజ్ పై ఉన్న గిడుగు రామ్మూర్తి, నందమూరి తారక రామారావు, నందమూరి హరికృష్ణ ఫోటోలను చూపిస్తూ వీరు తెలుగు భాషకి పట్టం కట్టిన మహనీయుల అంటూ కొన్ని యాడారు. నేడు గిడుగు రామ్మూర్తి పుట్టినరోజు. ఆయన పుట్టినరోజునే తెలుగు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అంటే ఆయనకు మనం ఇంతకన్నా గొప్ప గౌరవం ఇవ్వలేమంటూ పేర్కొన్నారు. కేవలం గ్రాంథిక భాషతోనే సాహిత్యం.. వ్యవహారిక భాషతో రాస్తే అది సాహిత్యం కాదు.. వాళ్ళు రచయితలు కాదు.. అనే స్థాయి నుంచి వ్యవహారిక భాష కూడా భాష.. వ్యవహారిక భాషలోనే సాహిత్యం రావాలి.. ఆఖరికి ఆదివాసీల భాష.. కూడా లిపిలేని భాష.. కూడా గౌరవాన్ని కలిగించిన మహనీయుడు అంటూ గిడుగు రామ్మూర్తిని పొగిడారు.

ఇకపోతే., నందమూరి తారకరామారవు గురించి మనం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీఆర్ అంటే తెలుగు భాష.. తెలుగు భాష అంటే ఎన్టీఆర్. తెలుగు భాష ఉన్నన్నాళ్ళు రామారావు గారు కీర్తి రామారావు గారి నీడ నిలబడిపోతుందని., పార్లమెంటులో కూడా తాను తన భాషలోనే మాట్లాడుతానని వింటే వినండి.. లేకపోతే లేదు.. అంటూ తెలుగు భాషలోనే మాట్లాడిన మహనీయుడు హరికృష్ణ అంటూ తెలిపారు. వీరందరినీ తలుచుకుంటూ తెలుగు దినోత్సవాన్ని జరుపుకుందామని పిలవగా ఒక తెలుగు భాష మీద బతుకుతున్న ఒక రచయితగా కార్యక్రమానికి రాకపోతే అంతకుమించి పాపం ఉండదు అంటూ తెలిపారు. ఇక్కడ చిత్ర విశేషమేమిటంటే అని తెలుపుతూ.. తెలుగు భాష గురించి తెలుగువాడు తెలుగు భాషలో తెలుగులో చెప్పడం అంటూ మాట్లాడారు. నిజానికి వేరే భాష వారి దగ్గర తెలుగు భాష గురించి మాట్లాడితే అది బాగుంటుందని., కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే.. తెలుగు భాషలో తెలుగు భాష గురించి తెలుగులో చెప్పే పరిస్థితి ఉందని ఆయన మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన మీడియా ప్రతినిధిగా సమాజాన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. కొన్నిసార్లు పాఠశాలలో తెలుగు గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్న పరిస్థితిలను చూసామని., దాని గురించి కూడా మాట్లాడుకున్నామని.. అది కరెక్టే అన్నవాళ్లను కూడా చూస్తామని., ఎందుకు పనికి వస్తుంది తెలుగు భాష., ఎవరు మాట్లాడుతున్నారు తెలుగులో.. దానివల్ల ఏమైనా ఉద్యోగం వస్తుందా., బతుకు తెరువుకు ఉపయోగపడుతుందా..? అంటూ ఆయన ప్రసంగించారు. తెలుగు భాష బతుకు తెరువు కోసం కాదు బ్రతుకు అని.. తెలుగు అంటే అమ్మ.. పుట్టినప్పుడు ఏడ్చినపుడు కూడా అమ్మ అని తెలుగులో ఏడ్చాం.. అప్పుడు అది మనకు తెలుగు భాష అని తెలియదు.. ఎందుకంటే ఆ ఏడుపు వచ్చింది తెలుగు వాళ్ళు పంచిన రక్తంలో నుంచి ఆ రక్తం ఉబికి తెలుగు కన్నీరై బయటికి వచ్చింది.. ఆ భాష ఇప్పుడు చాలామందికి పనికిమాలిన భాష అయింది., అమ్మ ముసలి అయిపోయింది ఇప్పుడు పని చేయలేదు.. కాబట్టి ఇప్పుడు అమ్మను బయటకు పంపించే పరిస్థితి అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలోని ప్రజలకు తాను పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. ఒక్క తమిళులు మాత్రమే కాదు.. ఒక్క తెలుగు ప్రజలకు తప్పించి దేశంలో ఉన్న ఇతర భాష ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్న ఎందుకంటే వారందరికీ వాళ్ళ మాతృభాష అంటే ఇష్టం అని తెలిపారు. ఒకవేళ తమిళనాడు రాష్ట్రంలో పాఠశాలలో తమిళం బోధించకూడదు అని చెబితే 24 గంటల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసునని మాట్లాడారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలా చేస్తే ఏం కాదని.. ఏమీ కాలేదు కూడా.. ఒప్పేసుకోవాల్సిందే అంటూ తెలిపారు. నిజానికి ఇప్పుడు చాలామంది తల్లిదండ్రు పిల్లలు తెలుగులో మాట్లాడితే కొడతారండి.. ఇలా ఉంది పరిస్థితి అంటూ ఆయన అన్నారు. ఇక కలకత్తాలో జరిగిన డాక్టర్ హత్య కేసుకు సంబంధించి కూడా ఆయన మాట్లాడుతూ.. అందుకు ప్రధాన కారణం వారి తల్లిదండ్రులు, వారి ఉపాధ్యాయులు అంటూ మాట్లాడారు. ఇలాంటి దారుణమైన సమాజంలో మనం జీవిస్తున్నామని., కేవలం తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు మాత్రమే సమాజాన్ని నిర్మించాలని ఆయన తెలిపారు. ఏ ఇద్దరూ ఓకే భాషకు సంబంధించిన వ్యక్తులు మాట్లాడితే.. వారు వారి మాతృభాషలోనే మాట్లాడుతారని., అదే ఇద్దరు తెలుగు ప్రజలు మాట్లాడితే మాత్రం తెలుగులో కాకుండా వేరే భాషలో మాట్లాడడానికి ప్రయత్నిస్తారంటూ తెలిపారు. పరిస్థితి ఇలా సాగితే భారతదేశంలో తెలుగు అనే భాష ఒకటి ఉండేది అంట పరిస్థితి వస్తుందని, అప్పుడు తెలుగు వారికి ఉనికి ఉండదని, మనం ఎవరో మనకే తెలియకపోతుందని ఆయన తెలిపారు. ఇంగ్లీష్ టైపింగ్ వల్ల తెలుగులో చాలా అక్షరాలను తీసేసారు అంటూ ఆయన వాపోయారు. తెలుగు భాషకు సొంతం పద్యం… అలాంటి భాష ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇప్పుడు సమాజం మార్చాలంటే వందమంది గిడుగు రామ్మూర్తిలు పుట్టిన కానీ సమాజాన్ని మార్చలేరు.. ఇలాంటి సమాజాన్ని మార్చేది కేవలం తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మాత్రమే అంటూ ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలుగు రాష్ట్రంలోని విద్యార్థులకు తెలుగు నేర్పండి.. లేకపోతే మీరు సమాజానికి సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని ఆయన తెలిపారు.

Show comments