Diabetes Care: డయాబెటిస్‌ను నియంత్రించుకోవాలంటే.. ఈ నాలుగు పండ్లను తినేయండి
- మధుమేహం పూర్తిగా నయం కాదు
- ఆహారపు అలవాట్లతోనే అదుపులోకి డయాబెటిస్
- జామ కివి పియర్ ద్రాక్షలు పేషెంట్లకు మేలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Diabetes Care: డయాబెటిస్ టైప్ 1 పూర్తిగా నిర్మూలించడానికి కుదరదు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపు అలవాట్ల ద్వారా దీనిని అదుపులో ఉంచుకోవచ్చు. డయాబెటిస్ రోగులు వారి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డయాబెటిక్ రోగులకు ఆహారంతో పాటు శారీరక శ్రమ కూడా చాలా ముఖ్యం. అయితే కొన్ని పుల్లటి, తీపి పండ్లు డయాబెటిస్‌ను కూడా నియంత్రించగలవు. వీటిలో అధిక మొత్తంలో సి విటమిన్ ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడమే కాకుండా శరీరాన్ని వ్యాధుల నుండి రక్షిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇలాంటి పండ్లు చాలా మేలు చేస్తాయని అనేక పరిశోధనలు కూడా చెబుతున్నాయి. ఇవి షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయగలవు. బ్లడ్ షుగర్ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉండే ఆ పండ్ల గురించి మీకు చెప్తాము.
జామకాయ
జామకాయ లేదా దాని ఆకులు రెండూ మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా చూస్తుంది. ఇది కాకుండా జామకాయలో ఫైబర్ , యాంటీఆక్సిడెంట్ల పుష్కలంగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ను అదుపులో ఉంచుతాయి.
Also Read
- IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
- Pawan Kalyan - Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
Read Also:Hyderabad No-1: పొదుపులో నెం.1గా భాగ్యనగర వాసులు.. ది గ్రేట్ ఇండియన్ వాలెట్ సర్వే
కివి
కివి కూడా తీపి, పుల్లని పండు. ఇందులో విటమిన్ సి కూడా పుష్కలంగా లభిస్తుంది. దీన్ని కూడా చాలా మంది ఇష్టపడుతున్నారు. ఇందులో విటమిన్ కె, ఫైబర్ ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా ఈ పండు మధుమేహ రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.
ద్రాక్ష
పిల్లలు ద్రాక్షపండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. వీటిని రోజూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి, కె కూడా ఇందులో ఉన్నాయి.
పియర్
పుల్లని పండ్లలో పియర్ కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పీచుతో పాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.
Read Also:Andhra Pradesh: తెలుగు సినిమా రంగాన్ని ఏపీకి తరలించడం సాధ్యమా?
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Pawan Kalyan – Vangaveeti Radhakrishna Meet: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. పవన్‌తో వంగవీటి రాధా భేటీ
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?