Dhurandhar: బాలీవుడ్‌లో దాదాపు 17 ఏళ్ల తర్వాత అధిక నిడివి (3.5 గంటలు) ఉన్న చిత్రంగా వచ్చిన రణ్‌వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ సినిమా ‘ధురందర్’కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. రణ్‌వీర్, అక్షయ్ ఖన్నా లాంటి స్టార్స్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ముఖ్య ఆకర్షణగా నిలిచాయి. నేడు తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతుంటే, ‘ధురందర్’ లాంటి భారీ బడ్జెట్ హిందీ సినిమాను కేవలం హిందీకే పరిమితం చేయడానికి మేకర్స్ ఎందుకు భయపడ్డారు? దీని వెనుక ఉన్న కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Jr NTR: నా హక్కులు కాపాడండి.. హైకోర్టుకు జూ. ఎన్టీఆర్
తెలుగు ప్రేక్షకులను కనెక్ట్ చేయడానికి అవసరమైన మాస్ ఎమోషన్ ఈ బాలీవుడ్ స్పై యాక్షన్ చిత్రంలో లోపించింది అనే టాక్ ఉంది. ‘ధురందర్’ కథ పూర్తిగా నార్త్ ఫ్లేవర్‌ను కలిగి ఉండడం వల్ల, అది తెలుగు ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో రుచించదని మేకర్స్ ముందే గ్రహించినట్లు తెలుస్తోంది. తెలుగులో బలమైన లోకల్ ఎమోషన్, కథాంశాలతో వస్తున్న చిత్రాల ముందు హిందీ స్పై యాక్షన్ వర్కవుట్ కాదని, అందువల్ల రికవరీ రిస్క్ తీసుకోవడం అనవసరమని భావించి, మేకర్స్ కేవలం హిందీ మార్కెట్‌కే పరిమితమయ్యారు.
IBomma Ravi: ఐబొమ్మ రవి కస్టడీపై రివిజన్ పిటిషన్: కారణాలివే!
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్‌ను తెలుగు సినిమాలే డామినేట్ చేస్తున్నాయి. ఇక్కడ సమస్య బాలీవుడ్ స్టార్స్‌కు తెలుగులో మార్కెట్ లేకపోవడం కాదు. సమస్యల్లా కథాంశంలోనే ఉంది. కేవలం స్టైల్, భారీ యాక్షన్‌తో పాన్ ఇండియా హిట్ రాదు. ప్రేక్షకుడి హృదయాన్ని కనెక్ట్ చేసే బలంగా, యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశాలు లేకపోవడమే ‘వార్ 2’ లాంటి భారీ కాంబోలు కూడా దక్షిణాదిలో క్లిక్ కాకపోవడానికి ప్రధాన కారణం. బాలీవుడ్ సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ సాధించాలంటే, కేవలం నార్త్ ఫ్లేవర్‌కు పరిమితం కాకుండా, అన్ని భాషల ప్రేక్షకులు మెచ్చే లోకల్ ఎమోషన్‌ను జోడించాల్సిన అవసరం ఉంది.
