Dhurandhar The Revenge : అక్కడ ఒక్కచోట 13 రోజుల్లో రూ. 360 కోట్లు వసూలు చేసిన ధురంధర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్ల మైలురాయిని చేరుకోవడానికి పరుగులు తీస్తోంది. అయితే ఈ సినిమా ఓవర్సీస్ లోను సరికొత్త సంచలనాలు నమోదు చేస్తుంది. కేవలం 13 రోజుల్లోనే ఓవర్సీస్ మార్కెట్‌లో కళ్లు చెదిరే వసూళ్లను సాధించింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం విదేశాల్లో ఇప్పటివరకు 38.5 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 360 కోట్లు) గ్రాస్‌ను వసూలు చేసింది.
ఇక్కడ గమనించాల్సిన ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఈ చిత్రం గల్ఫ్ దేశాలలో విడుదల కాలేదు. సాధారణంగా భారతీయ సినిమాలకు గల్ఫ్ మార్కెట్ అనేది బిగ్ మార్కెట్. అక్కడ ఇండియన్ సినిమాలు భారీ వసూళ్లు రాబడతాయి. కానీ ధురంధర్ గల్ఫ్ కంట్రీస్ లో రిలీజ్ కానప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం విశేషం అనే చెప్పాలి. అంతేకాకుండా చైనా వంటి ఈస్ట్ ఆసియా దేశాల్లో భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓవర్సీస్ గ్రాస్ సాధించిన చిత్రంగా ‘ధురంధర్’ రికార్డు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ సినిమా బాహుబలి-2 రికార్డులను సైతం అధిగమించి ముందుకు వెళ్తోంది. ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో కూడా ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్‌గా నిలుస్తోంది. ఐపీఎల్ సీజన్ నడుస్తున్నప్పటికీ థియేటర్ల వద్ద జనం రద్దీ ఏమాత్రం తగ్గకపోవడం ఈ సినిమాకున్న క్రేజ్‌కు నిదర్శనం. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓవర్సీస్ హిట్‌గా నిలవడమే కాకుండా త్వరలోనే రూ. 2000 కోట్ల మార్క్ ను కూడా అందుకునెలా ఉంది.
Also Read
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
- Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
- GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..