Site icon NTV Telugu

Dhurandhar Telugu Release: ‘ధురంధర్’ తెలుగు వెర్షన్‌కు కొత్త టెన్షన్.. అదే జరిగితే!

Dhurandhar

Dhurandhar

Dhurandhar Telugu Release: బాలీవుడ్‌ను చాలా రోజుల తర్వాత గట్టిగా షేక్ చేసిన సినిమా ‘ధురంధర్’. ఎన్నో రోజుల నుంచి కలెక్షన్ల ఆకలితో కొట్టుమిట్టాడుతున్న బాలీవుడ్‌ను రూ.500 కోట్లు దాటి పరుగులు పెట్టిస్తున్న సినిమాగా ధురంధర్ చరిత్ర సృష్టించింది. ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెకెక్కించారు. ఈ సినిమాలో హీరోగా రణ్‌వీర్ సింగ్, కీ రోల్‌లో అక్షయే ఖన్నా, మాధవన్ తదితర స్టార్స్ అద్భుతమైన నటనతో విశేషంగా ఆకట్టుకున్నారు. బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

READ ALSO: Liam Livingstone IPL: లక్కంటే లివింగ్‌స్టోన్‌దే.. ముందు అన్‌సోల్డ్‌, ఆపై కోట్ల వర్షం!

నిజానికి డిసెంబర్ 19న ధురంధర్ తెలుగు రిలీజ్ ఉంటుందనే అనే టాక్ ఉంది. ఇక్కడే ఇంట్రెస్టింగ్ ముచ్చట ఒకటి ఉంది. ఇదే డేట్‌లో ఎన్నో అంచనాలతో రాబోతున్న హాలీవుడ్ చిత్రం అవతార్ 3 కూడా ఉంది. నిజానికి ధురంధర్ సినిమాకు ఎంత హైప్ ఉన్నా కూడా అవతార్ 3 సినిమా క్రేజ్, ఎంత లేదన్నా దానిపై కొంత వరకు ఎఫెక్ట్ చూపవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవతార్ 3 కి పబ్లిష్ టాక్ బాగా వస్తే.. ధురంధర్ సినిమాకు ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందనేది చెప్పడం కష్టం అని అంటున్నారు. ఏది ఏమైనా ధురంధర్ తెలుగు సినిమా రిలీజ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.

READ ALSO: Syed Mushtaq Ali Trophy 2025: చరిత్ర సృష్టించిన ఝార్ఖండ్.. ఓటమితో ఎస్‌ఎంఏటీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీం

Exit mobile version