బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. థియేటర్లలో 45 రోజులు గడిచినా ఇంకా మంచి రన్ కొనసాగిస్తోంది ఈ చిత్రం. కాందహార్ హైజాక్, ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల నేపథ్యంలో సాగే ఈ స్పై థ్రిల్లర్‌లో రణ్‌వీర్ సింగ్ ‘రా’ ఏజెంట్‌గా అద్భుతమైన నటన కనబరచగా, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, సంజయ్ దత్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరిశారు. అయితే..
Also Read : ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది 2’ గ్యాంగ్‌లో ఊహించని ట్విస్ట్.. ఆ కీలక నటుడు అవుట్?
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా సంగతి తెలిసిందే. ఇక ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోగా, తాజా సమాచారం ప్రకారం, జనవరి 30 నుంచి ‘ధురంధర్’ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా ఇది అందుబాటులోకి రానుంది. ఇంట్లోనే కూర్చుని ఈ భారీ యాక్షన్ విజువల్ వండర్‌ను ఆస్వాదించాలనుకునే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.
