బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా, ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. థియేటర్లలో 45 రోజులు గడిచినా ఇంకా మంచి రన్ కొనసాగిస్తోంది ఈ చిత్రం. కాందహార్ హైజాక్, ముంబై దాడుల వంటి వాస్తవ సంఘటనల నేపథ్యంలో…