బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన ‘ధురంధర్’ సినిమాతో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసాడు ప్రముఖ సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్‌దేవ్. సరికొత్త సౌండింగ్ తో బీజీఎమ్ అదరగొట్టాడు సచ్‌దేవ్. ఈ సంగీత దర్శకుడు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ఇండియా హౌస్ కు సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, శాశ్వత్ సచ్‌దేవ్ రాకతో మ్యూజికల్ గా కూడా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
యూనిట్ సమాచారం ప్రకారం, శాశ్వత్ సచ్‌దేవ్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఐదు సాంగ్స్ కంపోజ్ చేశారట. ట్యూన్స్ చాలా విభిన్నంగా, సినిమా థీమ్‌కు తగ్గట్టుగా ఉన్నాయని సమాచారం. ప్రస్తుతం ఈ పాటల చిత్రీకరణ జరుగుతుండగా, మ్యూజిక్ అవుట్‌పుట్ పట్ల టీమ్ చాలా హ్యాపీగా ఉందట. ముఖ్యంగా శాశ్వత్ అందించిన మెలోడీ సాంగ్స్ అలాగే రఫ్ వర్షన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వేరే లెవల్ ఉన్నాయని సినిమాకు ఇవి మేజర్ ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇదిలా ఉండగా నేచురల్ స్టార్ నాని మరియు దర్శకుడు సుజిత్ కాంబోలో రాబోయే కొత్త సినిమాకు కూడా శాశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. నాని తన లేటెస్ట్ సోషల్ మీడియా పోస్ట్‌లో శాశ్వత్ కంపోజ్ చేసిన ‘ధురంధర్’ ట్రాక్‌ను ఉపయోగించడంతో, ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. ఏదేమైనా, ఒకేసారి రెండు భారీ చిత్రాలతో శాశ్వత్ సచ్‌దేవ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిపోయారు.
