Site icon NTV Telugu

Dhurandhar: హృతిక్ వ్యాఖ్యలపై దర్శకుడు స్పందన.. ‘ధురంధర్ పార్ట్‌ 2’పై క్లారిటీ ఇచ్చిన ఆదిత్య ధర్

Aditya Dhar Responds To Hrithik Roshan

Aditya Dhar Responds To Hrithik Roshan

ఇటీవల విడుదలై ప్రశంసలు అందుకుంటున్న బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘ధురంధర్’. రణ్‌వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా కీలక పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటివరకు సుమారు రూ.230 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఈ మూవీ పై పలు హీరోలు కూడా స్పందిస్తూ పాజిటీవ్ గా స్పందిస్తుండగా.. స్టార్ హీరో హృతిక్ రోషన్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి..

Also Read : Mowgli : రోషన్ కనకాల ‘మోగ్లీ’కి అమెరికాలో సాలిడ్ ఓపెనింగ్..!

‘‘ధురంధర్’ సినిమా బాగుంది నా హృదయానికి బాగా దగ్గరైన సినిమా. ఆదిత్య ధర్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని’ అని ప్రశంసించినప్పటికీ, ఇందులో చూపించిన కొన్ని రాజకీయ అంశాలను తాను అంగీకరించనని హృతిక్ చెప్పడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా దర్శకుడు ఆదిత్య ధర్ ఈ వ్యాఖ్యలపై స్పందించారు. ఈ పోస్ట్‌కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధర్.. ‘‘ఈ సినిమాపై మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ వంద శాతం కష్టపడ్డారు. మీ ప్రశంసలకు వారందరూ అర్హులే. అంతేకాదు, ‘ధురంధర్’కు పార్ట్‌ 2 కూడా ఉంటుంది. ఆ సినిమాను తెరకెక్కించేటప్పుడు అందరి సూచనలు, అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని మరింత మెరుగ్గా తీసుకురావడానికి ప్రయత్నిస్తాం’’ అంటూ స్పష్టత ఇచ్చారు. తాజాగా పార్ట్‌ 2 కూడా ఖరారైనట్లు అధికారికంగా క్లారిటీ రావడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిత్రబృందం ఇటీవల గ్రాండ్ సక్సెస్ మీట్‌ను కూడా నిర్వహించింది.

Exit mobile version