Site icon NTV Telugu

Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!

Durandhae

Durandhae

భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో దూసుకుపోతున్న రణ్‌వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు ఒక సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులను మార్చాలని, కొన్ని పదాలను మ్యూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ముఖ్యంగా సినిమాలో వాడిన ‘బలోచ్’ (Baloch) అనే పదాన్ని తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, జనవరి 1, 2026 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన సవరించిన వెర్షన్ (Revised Version) రానుంది. డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే అన్ని థియేటర్లకు కొత్త DCPలను పంపించి, పాత వెర్షన్‌ను మార్చాల్సిందిగా కోరారు.

Also Read : Kajal : న్యూ ఇయర్ ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇచ్చిన కాజల్.. బెడ్‌రూమ్ ఫొటోలు వైరల్

2025 లో విడుదలైన ఈ చిత్రం కేవలం 26 రోజుల్లోనే రూ. 754.50 కోట్లు వసూలు చేసి హిందీ సినిమాలో అతిపెద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి భారీ తారాగణం ఉన్న ఈ చిత్రాన్ని ఆదిత్య ధర్ తెరకెక్కించారు. పాకిస్థాన్‌లో భారత గూఢచారి చేసే పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్రం రెండో వారంలో మొదటి వారం కంటే ఎక్కువ వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఇక త్వరలోనే రూ. 800 కోట్ల మార్కును దాటుతుందని అంచనా వేస్తున్న తరుణంలో,మరి ఈ మార్పులు వసూళ్ల పై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.

Exit mobile version