Site icon NTV Telugu

Dhurandhar-Raja Saab : ధురంధర్ దూకుడుకు.. ప్రభాస్ ‘రాజా సాబ్’ బ్రేక్ వేయగలదా ?

Dhurandhar Rajasaab

Dhurandhar Rajasaab

బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. ప్రారంభంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నాలుగు వారాలు గడిచినా ఉత్తరాదిలో ఈ సినిమా జోరు ఏమాత్రం తగ్గలేదు. పెద్ద సినిమాలు ఏవీ లైన్లో లేకపోవడంతో, ధురంధర్ ప్రతిరోజూ డబుల్ డిజిట్ కలెక్షన్లతో దూసుకుపోతూ ఆల్‌టైమ్ టాప్-5 ఇండియన్ చిత్రాల జాబితాలోకి చేరేందుకు సిద్ధంగా ఉంది. అయితే,

Also Read : Lenin : లెనిన్ నుంచి భాగ్యశ్రీ లుక్ రిలీజ్

ఇప్పుడు ఈ సినిమా కలెక్షన్లకు బ్రేక్ వేసే సత్తా ఒక్క ప్రభాస్ సినిమాకే ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో రూపొందిన పాన్-ఇండియా హారర్ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. నార్త్ ఇండియాలో ప్రభాస్‌కు ఉన్న తిరుగులేని క్రేజ్ దృష్ట్యా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయం. ఒకవేళ ‘రాజా సాబ్’ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ‘ధురంధర్’ హవాకు చెక్ పడటం ఖాయం. మరి ఈ సంక్రాంతి రేసులో ప్రభాస్ తన బాక్సాఫీస్ పవర్‌తో రణవీర్ రికార్డులను అడ్డుకుంటారో లేదో చూడాలి!

Exit mobile version