NTRNeel : డ్రాగన్’లో ధురంధర్’ నటుడు కీలక పాత్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా తాజాగా చిత్ర యూనిట్ నుండి క్రేజీ అప్డేట్ వస్తోంది. ఇటీవల వరల్డ్ వైడ్ గా రికార్డ్స్ బద్దలు కొడుతున్న ‘ధురంధర్’ చిత్రంలో తన నటనతో మెప్పించిన బిమల్ ఒబెరాయ్ ఇప్పుడు డ్రాగన్ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారు.
Also Read : Stamina Health Tips : శృంగారంలో చెలరేగాలంటే తినాల్సిన ఫుడ్ ఇదే..
Also Read
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
- Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
ఇటీవల విడుదలైన ‘ధురంధర్’ చిత్రంలో బిమల్ ఒబెరాయ్ పోషించిన ‘శ్రీరాని బలోచ్’ పాత్రకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తనదైన శైలిలో సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్న బిమల్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ విజన్‌లో భాగమయ్యారు. ప్రశాంత్ నీల్ తన సినిమాల్లోని ప్రతి పాత్రకూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా డిజైన్ చేస్తాడు. ఈ నేపథ్యంలో బిమల్ పాత్ర కూడా చాలా బలంగా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బిమల్ ఒబెరాయ్ ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ధీటైన ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రనా లేక హీరోకు సపోర్టింగ్ రోలా అనేది ఇంకా తెలియాల్సి ఉన్నప్పటికీ ఆయన రాకతో సినిమాకు మరింత వెయిట్ పెరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికే టోవినో థామస్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో, బిమల్ ఎంట్రీ ప్రాధాన్యత సంతరించుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రశాంత్ నీల్ మార్కు మేకింగ్‌తో ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ను మరో లెవల్‌కు తీసుకెళ్లేలా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. 2027లో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే బిమల్ ఒబెరాయ్ పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!