Site icon NTV Telugu

Dhurandhar 2 : ‘ధురంధర్ 2’లోకి మరో బాలీవుడ్ స్టార్ హీరో ఎంట్రీ? ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా..

Durandhar,ranveer

Durandhar,ranveer

భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన ‘ధురంధర్’ సీక్వెల్ కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మార్చిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ధురంధర్ 2’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక మ్యాడ్ రూమర్ వైరల్ అవుతోంది. ఆదిత్య ధర్ గతంలో తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ‘యురి’ (URI) కి, ఈ ధురంధర్ సీక్వెల్‌కు లింక్ ఉందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్‌లో కనిపిస్తాడని సమాచారం.

Also Read : Peddi : ‘పెద్ది’ మాస్ జాతర మొదలైంది.. థియేటర్లు షేక్ అవ్వాల్సిందే!

ఒకవేళ ఇదే నిజమైతే, విక్కీ కౌశల్ మళ్ళీ అదే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో రణ్వీర్ సింగ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడన్నమాట. ఈ ‘యూనివర్స్’ కనెక్షన్ గనుక పొరపాటున నిజమైతే, నార్త్ ఇండియాలో ఈ సినిమా వసూళ్లను ఆపడం ఎవరి తరమూ కాదు. ఇప్పటికే పార్ట్ 1 దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు దానికి ‘యురి’ క్రేజ్ కూడా తోడైతే, బాక్సాఫీస్ వద్ద ధురంధర్ 2 సృష్టించే ప్రకంపనలు ఊహకందని రేంజ్‌లో ఉంటాయి. మరి ఈ రూమర్ పై చిత్ర యూనిట్ ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో వేచి చూడాలి.

Exit mobile version