Dhurandhar TheRevenge : ధురంధర్ 2 ఒక్కో టికెట్ ధర రూ. 3100.. అయినా దొరకని టికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రణవీర్ సింగ్ నటించిన మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. మరికొన్ని గంటల్లో ప్రీమియర్స్ తో విడుదల కానున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ వంద కోట్ల దాటేశాయి. మొదటి రోజు రూ. 250 కోట్లు ఉండే ఛాన్స్ ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు టికెట్ ధరలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక టికెట్ ధర ఏకంగా రూ. 3100 పలుకుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Also Read : Dhurandhar2 : ‘ధురంధర్ 2’ ప్రీమియర్స్.. ఇంకా అందని కంటెంట్.. షోలు రద్దయ్యే ఛాన్స్?
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
- YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
సాధారణంగా పెద్ద సినిమాలకు టికెట్ ధరలు పెంచడం చూస్తుంటాం, కానీ ‘ధురంధర్ 2’ ఆ హద్దులను చెరిపేసింది. ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్ లోని ఒక ప్రీమియం స్క్రీన్ లో ఒక టికెట్ ధరను ₹3,100 గా నిర్ణయించారు. కేవలం 42 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ లగ్జరీ స్క్రీన్ లోని రీక్లైనర్ సీట్ల కోసం ఈ స్థాయి ధరను ఫిక్స్ చేశారు. దీనికి అదనంగా బుక్ మై షో వంటి ప్లాట్‌ఫామ్ చార్జీలు కలిపితే మరో రూ. 45 వరకు పెరుగుతుంది. అయినప్పటికీ, ఈ షోలకు సంబంధించిన టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటం రణవీర్ సింగ్ క్రేజ్ కు నిదర్శనం.
Also Read : Dhurandhar TheRevenge : ధురంధర్ 2 మొదటి రోజు కలెక్షన్స్.. బాహుబలి, పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్?
కేవలం ఢిల్లీలోనే కాదు, ముంబైలోని బోర్విలి ఐనాక్స్ మెగాప్లెక్స్ లో కూడా టికెట్ ధర రూ. 3,100 చేశారు. బెంగళూరు వంటి నగరాల్లో కూడా డైన్-ఇన్ స్క్రీన్ల టికెట్లు రూ. 2,000 నుండి రూ. 2,900 మధ్య విక్రయించబడుతున్నాయి. ఈ స్థాయిలో ధరలు ఉన్నప్పటికీ షోస్ హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా లక్షలాది టికెట్లు అమ్ముడయ్యాయి. హిందీ వెర్షన్ తో పాటు తెలుగులో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేలా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలపై సీఎం చంద్రబాబుకు జగన్ ప్రశ్నలు.. 1-6 ట్విస్ట్‌లతో ఎక్స్‌లో పోస్టులు!
-
Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
-
PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?