Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ వసూళ్ల సునామీ.. ‘ఆర్‌ఆర్ఆర్’ రికార్డులు బ్రేక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలో కళ్లు చెదిరే వసూళ్లను సాధించి, సరికొత్త మైలురాళ్లను నెలకొల్పింది. బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ విశ్వరూపం చూపిస్తుండటంతో ట్రేడ్ వర్గాలు సైతం విస్మయానికి గురవుతున్నాయి.
READ ALSO: Dhurandhar 2: పాపం.. ఆ పాక్ లీడర్’కు నిద్ర కరువు.. కూతురు పాత్ర కూడా దెబ్బేసినట్టే?
Also Read
- Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
- YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
- Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
బాహుబలి, కల్కి రికార్డులు బ్రేక్..
వసూళ్ల పరంగా ‘ధురంధర్ 2’ ఒక ప్రభంజనంలా దూసుకుపోతోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.750 కోట్ల (గ్రాస్) కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బుధవారం నిర్వహించిన షోల ద్వారానే ఏకంగా రూ.43 కోట్లు సాధించి శుభారంభం సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఆదివారం ఒక్కరోజే దేశీయంగా రూ.115 కోట్లు వసూలు చేసి, సింగిల్ డే హయ్యెస్ట్ కలెక్షన్ల రికార్డును నెలకొల్పింది. విదేశీ మార్కెట్‌లో కూడా ఈ మూవీ రూ.180 కోట్లతో సత్తా చాటుతోంది.
ఖాన్ల రికార్డులకు ఎసరు..
హిందీ చిత్రసీమలో ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ పేరిట ఉన్న రూ.287 కోట్ల ఓపెనింగ్ వీకెండ్ రికార్డును ‘ధురంధర్ 2’ సునాయాసంగా తుడిచిపెట్టేసింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక ఓపెనింగ్ వీకెండ్ సాధించిన రెండో చిత్రంగా నిలిచి.. ‘బాహుబలి 2’ (రూ. 591 కోట్లు), ‘కల్కి 2898 ఏడీ’ (రూ. 500 కోట్లు), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (రూ. 470 కోట్లు) వంటి భారీ పాన్ ఇండియా చిత్రాల రికార్డులను క్రాస్ చేసింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ (రూ. 762 కోట్లు) మాత్రమే దీనికంటే ముందుండటం విశేషం.
2000 కోట్ల వైపు వడివడిగా అడుగులు..
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, ఈ మూవీ అతి త్వరలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. లాంగ్ రన్‌లో ఈ స్పై థ్రిల్లర్ రూ.2000 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆదిత్య ధర్ టేకింగ్, రణవీర్ సింగ్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయని సామాన్య ప్రేక్షకులతో పాటు, సినీ తారలు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజావార్తలు
-
Trump: పుతిన్ యుద్ధం ముగించాలనకుంటున్నారు.. జెలెన్స్కీనే హద్దు దాటారు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: హైదరాబాద్‌కి నెట్‌ఫ్లిక్స్, వార్నర్ బ్రదర్స్ ఎంట్రీ.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ట్వీట్!
-
AP Liquor Shops: మద్యం దుకాణాల రెన్యువల్ గడువు పొడిగింపు
-
YS Jagan: డీఎస్సీపై సీబీఐ విచారణ అంటే ఎందుకంత భయం..? చంద్రబాబును ప్రశ్నించిన జగన్
-
Tarique Rrahman: తారిఖ్ రెహమాన్ అరుదైన రికార్డ్.. యూఎన్‌లో మూడో తరం నేతగా ప్రసంగం
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!