Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ వసూళ్ల గర్జన.. 6 రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌కు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ సృష్టిస్తున్న సునామీ ఆగడం లేదు. దర్శకుడు ఆదిత్య ధర్ – రణవీర్ సింగ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ఇండియన్ సినిమా రికార్డులన్నింటినీ తిరగరాస్తోంది. కేవలం 6 రోజుల్లోనే ఈ సినిమా సాధిస్తున్న వసూళ్లు చూస్తుంటే ట్రేడ్ వర్గాలు సైతం నోరెళ్లబెడుతున్నాయి. రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే ఈ సినిమా రికార్డుల వేట మొదలుపెట్టింది. సినిమా విడుదలైన ఆరో రోజు (మంగళవారం) కూడా తన పట్టును నిలబెట్టుకుంది. మంగళవారం ఈ సినిమా వసూళ్లు సుమారు రూ.56.55 కోట్లు అని సమాచారం. ఇండియా వైడ్ మొత్తం వసూళ్లు రూ.687.43 కోట్లు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్త ఈ చిత్రం ఏకంగా రూ.919 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో రెండు రోజుల్లోనే ఇది రూ.1000 కోట్ల మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
READ ALSO: Anil Ravipudi: వెంకటేష్ కోసం మ్యారిడ్ బ్యూటీ, కళ్యాణ్ రామ్ కోసం యంగ్ బ్యూటీ?
Also Read
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డు కనుమరుగు!
ఇన్నాళ్లూ బాలీవుడ్‌లో అత్యధిక ఓపెనింగ్ వసూళ్లు సాధించిన చిత్రంగా ఉన్న ‘బాహుబలి 2’ రికార్డును ‘ధురందర్ 2’ బద్దలు కొట్టింది. పెయిడ్ ప్రివ్యూలతో కలిపి ధురంధర్ 2 మొదటి రోజే రూ.145 కోట్లు వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం వారాంతాల్లోనే కాకుండా, వర్కింగ్ డే అయిన సోమవారం కూడా రూ.500 కోట్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటిందని చెబుతున్నారు. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవలి కాలంలో భారీ వసూళ్లు సాధించిన పలు చిత్రాలను వెనక్కి నెట్టింది. స్త్రీ 2 రూ.857.15 కోట్లు, కాంతర చాప్టర్ 1 రూ.852.36 కోట్లు, చావా రూ.601.54 కోట్లు భారీ రికార్డులను కొల్లగొట్టింది. ఈ చిత్రాల లైఫ్ టైమ్ వసూళ్లను ‘ధురందర్ 2’ కేవలం ఆరు రోజుల్లోనే అధిగమించడం విశేషం. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటనకు, ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వంటి ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రాన్ని కొనియాడారు. రణవీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది ‘మైల్ స్టోన్’ మూవీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Youth: ఒక రోజు ఆలస్యంగా థియేటర్స్‌లో ‘యూత్’ సందడి!
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!