NTV Telugu Site icon

Dhruv Jurel: ధోని రికార్డ్‭ను సమం చేసిన ధృవ్ జురెల్..

Dhruv

Dhruv

Dhruv Jurel equal ms dhoni record: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో భారత్-A ఆటగాడు ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్‌లో ముఖ్యమైన రికార్డును సమం చేశాడు. ఇండియా-Bతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా జురెల్ మొత్తం 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఉమ్మడిగా అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని సమం చేశాడు. ఇండియా-B లో చాలా మంది కీలక ఆటగాళ్లను అవుట్ చేయడంలో జురెల్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను ఇండియా-B రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ , ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ రెడ్డి, సాయి కిషోర్, నవదీప్ సైనీ క్యాచ్‌ లను అందుకున్నాడు. ఇండియా-A ఫాస్ట్ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన, వికెట్ వెనుక జురెల్ యొక్క చురుకుదనం కారణంగా ఇండియా-B రెండవ ఇన్నింగ్స్ కేవలం 184 పరుగులకే పరిమితమైంది.

Tollywood: సూపర్ సండే.. టాలీవుడ్ సూపర్ – 8 స్పెషల్ న్యూస్..

ధోనీ ఇంతకు ముందు 2004-05 సీజన్‌లో ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు సెంట్రల్ జోన్‌పై 7 క్యాచ్‌లు పట్టడం ద్వారా ఈ రికార్డును సృష్టించాడు. ధోనీ, జురెల్ కంటే ముందు సునీల్ బెంజమిన్ వికెట్ కీపర్‌గా 7 వికెట్లు తీయడంలో సహకరించాడు. 1973 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో, బెంజమిన్ నార్త్ జోన్‌పై సెంట్రల్ జోన్ కోసం 6 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ తీసుకున్నాడు. ఇవి కాకుండా సదానంద్ విశ్వనాథ్ (1980-81) కూడా ఒక ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు అందుకున్నాడు. వికెట్ కీపింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జురెల్ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచాడు. అతను తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. నవదీప్ సైనీ చేతిలో ఎల్‌బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీని తర్వాత, అతను తన రెండవ ఇన్నింగ్స్‌లో తన ఖాతాని కూడా తెరవలేకపోయాడు. డక్ అవుట్ గా వెనుతిరిగారు. ఈ 23 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 19 మ్యాచ్‌ల్లో 982 పరుగులు చేశాడు.