Dhruv Jurel: ధోని రికార్డ్‌ను సమం చేసిన ధృవ్ జురెల్..
- ధోనీ ఇంతకు ముందు 2004-05 సీజన్‌లో 7 క్యాచ్‌లు పట్టడం ద్వారా ఈ రికార్డును సృష్టించాడు.
- భారత్-A ఆటగాడు ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్‌లో ముఖ్యమైన రికార్డును సమం చేశాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Jurel equal ms dhoni record: ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో భారత్-A ఆటగాడు ధృవ్ జురెల్ వికెట్ కీపింగ్‌లో ముఖ్యమైన రికార్డును సమం చేశాడు. ఇండియా-Bతో జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా జురెల్ మొత్తం 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఈ టోర్నీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో ఉమ్మడిగా అత్యధిక క్యాచ్‌లు పట్టిన వికెట్‌కీపర్‌గా నిలిచాడు. ఈ విషయంలో మహేంద్ర సింగ్ ధోనీని సమం చేశాడు. ఇండియా-B లో చాలా మంది కీలక ఆటగాళ్లను అవుట్ చేయడంలో జురెల్ ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను ఇండియా-B రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్ , ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ రెడ్డి, సాయి కిషోర్, నవదీప్ సైనీ క్యాచ్ లను అందుకున్నాడు. ఇండియా-A ఫాస్ట్ బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన, వికెట్ వెనుక జురెల్ యొక్క చురుకుదనం కారణంగా ఇండియా-B రెండవ ఇన్నింగ్స్ కేవలం 184 పరుగులకే పరిమితమైంది.
Tollywood: సూపర్ సండే.. టాలీవుడ్ సూపర్ – 8 స్పెషల్ న్యూస్..
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- Pakistan: "మక్కా ఒప్పందం అండగా లేదు".. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
- Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ధోనీ ఇంతకు ముందు 2004-05 సీజన్‌లో ఈస్ట్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు సెంట్రల్ జోన్‌పై 7 క్యాచ్‌లు పట్టడం ద్వారా ఈ రికార్డును సృష్టించాడు. ధోనీ, జురెల్ కంటే ముందు సునీల్ బెంజమిన్ వికెట్ కీపర్‌గా 7 వికెట్లు తీయడంలో సహకరించాడు. 1973 దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో, బెంజమిన్ నార్త్ జోన్‌పై సెంట్రల్ జోన్ కోసం 6 క్యాచ్‌లు, ఒక స్టంపింగ్ తీసుకున్నాడు. ఇవి కాకుండా సదానంద్ విశ్వనాథ్ (1980-81) కూడా ఒక ఇన్నింగ్స్‌లో 6 క్యాచ్‌లు అందుకున్నాడు. వికెట్ కీపింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన జురెల్ బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నిరాశపరిచాడు. అతను తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 2 పరుగులకే ఔటయ్యాడు. నవదీప్ సైనీ చేతిలో ఎల్‌బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీని తర్వాత, అతను తన రెండవ ఇన్నింగ్స్‌లో తన ఖాతాని కూడా తెరవలేకపోయాడు. డక్ అవుట్ గా వెనుతిరిగారు. ఈ 23 ఏళ్ల యువ బ్యాట్స్‌మన్ తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో 19 మ్యాచ్‌ల్లో 982 పరుగులు చేశాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
-
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
-
Trump-Jinping: సెప్టెంబర్ 24న వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో జిన్‌పింగ్ భేటీ.. కీలక అజెండా ఇదేనా?
-
SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. ‘మిస్టర్ 360’ అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!