Site icon NTV Telugu

Dharpally Rajasekhar Reddy : హైదరాబాద్‌లో చాలా చెరువులు కబ్జాకు గురయ్యాయి

Darpally

Darpally

నిజాలు చెప్పడానికి ప్రతిపక్షం కావాలి అబద్దాలు దాచానికి అధికార పక్షం కావాలి అనే విధంగా దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్‌ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వారం రోజులుగా ప్రజలు పడే ఇబ్బందులు గుర్తించి జీహెచ్‌ఎంసీని కోరడం తప్పా దాసోజు శ్రవణ్ చెప్పాలన్నారు. హైదరాబాద్ లో కేవలం 6 శాతం మాత్రమే వర్షాలు కురిసాయని, వర్షాల కారణంగా వచ్చే ఇబ్బందుల నుండి ప్రజలను కాపాడమని కోరినందుకు రేవంత్ రెడ్డి పై వ్యాఖ్యలు చేస్తున్నారా అని ఆయన అన్నారు.

గత వారం రోజులుగా తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో 65 శాతం వర్షాలు పడ్డాయి.. అదే వర్షం హైదరాబాద్ లో పడితే హైదరాబాద్ సముద్రం లా మారేదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. హైదరాబాద్ చాలా వరకు చెరువులు కబ్జాకు గురయ్యాయని, 2014 కు ముందు చెరువుల పరిస్థితికి నేటికి జరిగిన మార్పులపై చర్చలకు రండి అని ఆయన సవాల్‌ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చెరువులు కబ్జాకు గురైన విషయాన్నే రేవంత్ రెడ్డి తెలిపారు. కాదని చెప్పేందుకు మీరు మీ ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ఆయన అన్నారు. మూసి నదిలో గడ్డి తొలగింపు పేరు మీద లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారని, దాసోజు శ్రవణ్ పార్టీలు మారినట్టు చెరువుల ఆక్రమణలకు సంబంధిచిన లెక్కలు మారవు గుర్తు పెట్టుకోవాలన్నారు రాజశేఖర్‌ రెడ్డి.

భారీ వర్షాలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ధనికులు వుండే స్లమ్స్ ఏరియగా మారి కార్లు నీటిపై తెలియాడాయని, వరదల అనంతరం గ్రామాల్లోకి పాములు, విష ప్రాణులు వచ్చి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు. భారీ వర్షాలకు గ్రామాల్లో పశువులు, పెంపుడు జంతువులు ఎన్నో మూగ జీవులు వరదల్లో కొట్టుకపోయ్యాయని, కడెంలో గేట్లు తీయలేని పరిస్థితిలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్నారు. చెరువులు, వరదలపై దమ్ముంటే దాసోజు శ్రవణ్, బిఆర్ఎస్ నాయకులు చర్చకు బుధవారం రోజు రండి అని ఆయన అన్నారు.

Exit mobile version