Dharmendra Pradhan: రెండుసార్లు రాజీనామాకు సిద్ధం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dharmendra Pradhan: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 2సార్లు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రెండు సార్లు రాజీనామాకు ప్రయత్నించినా ప్రభుత్వం అంగీకరించలేదు. చివరకు ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో ఆయన రాజీనామాను ఎన్డీయే సర్కార్ ఆమోదించాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
జూలై 20న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కూడా ప్రధాన్ తన పదవికి రాజీనామా చేస్తానని ప్రతిపాదించారు. అయితే, విద్యారంగంలో సంస్కరణలు కొనసాగించాలని కేంద్ర నాయకత్వం ఆయనను కోరిందని సమాచారం. మంత్రి రాజీనామా చేయడం సమస్యకు సులభమైన పరిష్కారం మాత్రమే అని, బాధ్యత నుంచి తప్పుకోవడం అవతుందని మోడీ ప్రభుత్వం భావించింది.
Also Read
- E20 JANTA PARTY: సీజేపీ తర్వాత, "E20 జనతా పార్టీ" పుట్టుకొచ్చింది.. వీళ్ల డిమాండ్ ఇదే..
- CJP: పంజాబ్, కర్ణాటక పేపర్ లీకుల మాటేమిటి.. కాక్రోచ్ల మౌనం ఎందుకు..?
- Asaduddin Owaisi: యూపీలో బీజేపీని ఓడిద్దాం.. అఖిలేష్‌కు ఓవైసీ ఆఫర్..
- BJP: బీజేపీ పెద్ద లక్ష్యాల కోసం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చిన్న తాగ్యమా.?
కానీ జూలై 20 ‘‘పార్లమెంట్ మార్చ్’’ తరహాలో భారీ నిరసన, ఆందోళన చేపడుతామని సీజేపీ హెచ్చరించడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకుంది. దీంతో పాటు జూలై 20 నిరసనల్లో పలువురు విద్యార్థులు గాయపడటం ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసింది. అదే సమయంలో కొందరు దేశ వ్యతిరేక శక్తులు కూడా ఈ నిరసనలను తమ ప్రయోజాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తుందనే ఇంటెలిజెన్స్ నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది.
డిజిటల్ మానిటరింగ్‌లో విద్యార్థుల ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్న 400కుపైగా సోషల్ మీడియా ఖాతాలను గుర్తించినట్లు, వాటిలో సుమారు 100 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు పాకిస్థాన్ నుంచి నిర్వహించబడుతున్నాయని ప్రాథమిక సమాచారం లభించినట్లు పేర్కొన్నారు. ఇదే కాకుండా ఢిల్లీ జంతర్ మంతర్ ఆందోళనల్లో క్రిమినల్ రికార్డులు ఉన్న 400 మందిని గుర్తించినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాన ఆమోదించి, ఈ ఆందోళనకు పరిష్కారం దిశగా తీసుకెళ్లింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ మెరుపులు.. మరో హాఫ్ సెంచరీ పూర్తి.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
-
Dharmendra Pradhan: రెండుసార్లు రాజీనామాకు సిద్ధం.. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే ప్రధాన్ రాజీనామా..
-
Missing Schoolgirls : మిస్టరీకి ఎండ్.. మాయమైన బాలికలు.. సేఫ్‌గా దొరికారు.!
-
E20 JANTA PARTY: సీజేపీ తర్వాత, “E20 జనతా పార్టీ” పుట్టుకొచ్చింది.. వీళ్ల డిమాండ్ ఇదే..
-
Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!