NTV Telugu Site icon

Kethireddy Venkatarami Reddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Redd

Kethireddy Venkatarami Reddy: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి.. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.. ధర్మవరంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నా నియోజకవర్గ ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్నాను అన్నారు.. ఉదయమే నేను ప్రతీ ఇళ్లు తిరుగుతూ సమస్యలు తెలుసుకుంటున్నాను.. మధ్యాహ్నం నా భార్య తిరుగుతుంది.. సాయంత్రం నా తమ్ముడు తిరుగుతున్నాడు.. ఇలా మా కొంపంతా మీకు చాకిరీ చేస్తున్నామంటూ జనంపై కాస్త అసహనం వ్యక్తం చేశారు.. ఇలా మా ఇంటిల్లిపాది మీకే చాకిరీ చేస్తున్నాం.. అయినా లోకేష్ లాంటి పనికిమాలిన వాడు విమర్శలు చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు.. మొన్న పరోటా, పుల్కాలు ఇద్దరు పాదయాత్ర చేశారంటూ సెటైర్లు వేసిన ఆయన.. నాపై అనవసరమైన విమర్శలు చేశారని మండిపడ్డారు.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ధర్మవరం నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లు నేను కట్టిస్తే.. వారు కట్టించామంటారు అంటూ టీడీపీ నేతలపై ఫైర్‌ అయ్యారు కేతిరెడ్డి.. ధర్మవరంలో 12 వేల ఇళ్లు కట్టించాను.. తాగునీటి సమస్య లేకుండా చేశాను.. చంద్రబాబు హయాంలో ధర్మవరంలో ఒక్క ఇల్లు అయినా కట్టించాడా..? అని ప్రశ్నించారు. ఎవరైనా చదువుకోమని పిల్లలకు చెబుతారు.. కానీ, పనికిమాలిన లోకేష్ 20 కేసులు ఉంటే కానీ నా వద్దకు రావద్దు అంటాడు.. వీడు ఒక ముఖ్యమంత్రి కొడుకు.. కాబోయే ముఖ్యమంత్రి అట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. మీరంతా ఒకటే ఆలోచించుకోవాలి.. ప్రజలను నమ్ముకునే సీఎం వైఎస్‌ జగన్‌ రాజకీయం చేస్తున్నారు.. ఆయనకు అండగా ఉండాల్సిన బాధ్యత మనపైనే ఉందంటున్నారు. సంక్షేమ పథకాలతో అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది.. మీరు బాగుండాలి, మీ పిల్లలకు మంచి జరగాలి అని కోరుకుంటున్నాం.. కానీ, లోకేష్‌ లాంటి వాళ్లు వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. గలాట పెట్టుకొండి, కేసులు ఉండాలని చెబుతున్నాడు అంటూ మండిపడ్డారు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అయితే, నా కుటుంబం మొత్తం మీకు చాకిరీ చేస్తుందంటూ.. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.