NTV Telugu Site icon

Dharmana PrasadaRao:మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా?

Dharmana Fires On Babu

Dharmana Fires On Babu

Minister Dharama Prasada Rao: మూడురాజధానులకు మద్దతుగా ఏపీ మంత్రులు గళం విప్పుతున్నారు. శ్రీకాకుళంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాట్ కామెంట్స్ చేశారు. శ్రీకాకుళం బార్ అసోసియేషన్ సభ్యులతో మంత్రి ధర్మాన సమావేశం నిర్వహించారు. 3 రాజధానులకు న్యాయవాదుల మద్దతు కోరిన ధర్మాన… రాజ్యాంగంలో ఎక్కడా క్యాపిటల్ గురించిన ప్రస్తావన లేదన్నారు. రాజ్యాంగంలో రాజధానికి నిర్వచనం లేదు.పాలనా సౌలభ్యం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు అని రాజ్యాంగం చెబుతోంది.అందరి ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని ఉండాలి. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ ను నాటి టీడీపీ ప్రభుత్వం ప్రక్కన పెట్టేసిందన్నారు.

టిడిపి ప్రభుత్వం తనకు అనుకూలమైన వ్యక్తులతో రాజధానిపై కమిటీ వేసుకుంది.అప్పటి సీఎం చంద్రబాబు రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు.అభివృద్ధి అంతా హైదరాబాద్ లో కేంద్రీకృతమవ్వటం వల్ల సమస్య వచ్చిందని శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ లో చెప్పింది.లార్జ్ క్యాపిటల్ పనికిరాదని శివరామకృష్ణన్ చెప్పారు.పెట్టుబడి అంతా అమరావతిలో పెడితే ఎలా.ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత మనల్ని వెల్లగొడితే ఏమి కావాలి.అమరావతిలో రియల్ ఎస్టేట్ రాజధాని మోడల్ పెట్టారు.చంద్రబాబు స్వార్ధపూరిత ఆలోచనే అమరావతి.సింగపూర్ ప్రైవేట్ కంపిణీలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకున్నారు.

Read Also: Deepika Padukone: ఆ.. ఆలోచనే లేదు.. మేము బానే ఉన్నాం

సింగపూర్ ప్రభుత్వానికి అమరావతి రాజధానికి సంబంధం లేదని సింగపూర్ మంత్రి ఈస్వరన్ చెప్పారు.రాజ్యాంగ బద్దంగా ఏర్పడిన శివరామకృష్ణన్ కమిటీ సూచనలు అమలు చేయటమే మా ముందున్న మార్గం.మూడు రాజధానుల ఏర్పాటు లో జగన్ స్వార్ధం ఏముంది.కడపలో రాజధాని పెడుతున్నాడా?భూమి విలువ రెట్టింపు అవుతుందని భూమి ఇస్తే అది త్యాగం అవుతుందా?చంద్రబాబు మాటలకు రైతులు మోసపోయారు.మా ప్రాంతానికి వచ్చి మా అభివృద్ధిని అడ్డుకుంటారా? అని మంత్రి ధర్మాన అమరావతి రైతుల మహా పాదయాత్ర నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Assam CM: అస్సాం ముఖ్యమంత్రికి ‘జెడ్‌ ప్లస్’ సెక్యూరిటీ.. అందుకేనా?