తమిళ స్టార్ హీరో ధనుష్ పుత్రోత్సాహంలో పొంగిపోతున్నాడు.. ఇటీవల తమిళనాడులో ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.. ధనుష్ పెద్ద కొడుకు యాత్ర రాజాకు సంబంధించిన మార్కుల వార్త వైరల్ అవుతోంది.. ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.. 12వ తరగతి పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల వార్తలతో ఇప్పటికే సోషల్ మీడియా హోరెత్తుతోంది.. మరి ఆ యువ హీరోకు ఎన్ని మార్కులు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం..
ఈ ఏడాది ఏప్రిల్ లో దేశ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు జరిగాయి.. ఇంటర్ పరీక్షల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కర్ణాటక 10వ తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి.. తమిళనాడులో మూడు రోజుల క్రితమే మార్కులు విడుదల అయ్యాయి.. ఆ ఫలితాల్లో ధనుష్ కొడుకు రాజా అత్యధిక మార్కులను సాధించి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు..
ఆ కుర్రాడి మార్కులను చూస్తే.. రాజా మాతృభాషలో 100కి 98, ఇంగ్లీషులో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించారు. అలాగే అతను జీవశాస్త్రంలో 97 మార్కులు సాధించాడు. యాత్ర రాజా మొత్తం మార్కులు 600కి 569 మార్కులు సాధించాడు. ఇంటర్ లో మొత్తం 94.08 శాతం మార్కులతో పాసయ్యాడు..
ధనుష్ సినిమాల విషయానికొస్తే.. ధనుష్ చివరిగా కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటించాడు. అరుణ్ మాథేశ్వరన్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించింది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించాడు. సంక్రాంతి కానుకగా రిలీజైన కెప్టెన్ మిల్లర్ యావరేజ్ గా నిలిచింది.. ప్రస్తుతం కుబేర, రాయన్ సినిమాలో నటిస్తున్నాడు..