D 56: హీరో ధనుష్.. ఈ వ్యక్తి గురించి పెద్దగా పరిచయాలు అవసరం లేదు. ఈ కోలీవుడ్ స్టార్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఈ స్టార్ హీరో నేషనల్ అవార్డ్ ను కూడా అందుకున్న విషయమే. హీరో ధనుష్ కేవలం తన నటనతో పాటు దర్శకత్వంతో కూడా ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విభిన్నమైన పాత్రలతో, పాత సినిమాలకు భిన్నంగా, డిఫరెంట్ స్క్రిప్ట్ ఉండే కథాంశాలతో కొనసాగిస్తున్న ధనుష్.. దక్షిణ భారతంతో పాటు బాలీవుడ్‌లో కూడా తనకంటూ పెద్దెత్తున మార్కెట్‌ను పెంచుకున్నాడు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా ఇలా అనేక పనులతో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ధనుష్.. ఇప్పుడు మరో సరికొత్త సినిమాకు సిద్ధమవుతున్నారు.
ఇందులో భాగంగా 2021లో విడుదలైన ‘కర్ణన్’ సినిమా ద్వారా తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్‌తో జోడీగా వచ్చిన చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీనితో ఇప్పుడు అదే కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ధనుష్ తన 56వ సినిమాను ‘D 56’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించారు. ఈ సినిమాను వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఇషారి కె. గణేష్ నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా ధనుష్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. అందులో పుర్రె మీద పెద్ద కత్తి గుచ్చిన విధంగా ఉండి.. “ఒక గొప్ప యుద్ధం ప్రారంభించబోతున్నాం” అనే క్యాప్షన్‌తో ధనుష్ ఈ పోస్టర్‌ను షేర్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది.
#D56 Roots begin a Great War
A @mari_selvaraj film pic.twitter.com/3yfhd6B2pZ— Dhanush (@dhanushkraja) April 9, 2025
ప్రస్తుతం ధనుష్ తన సొంత దర్శకత్వంలో ‘ఇడ్లీ కడాయ్’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. అలాగే ‘అమరన్’ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామితో ‘D 55’ సినిమా కూడా సెట్స్ పై ఉంది. మరోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ‘కుబేర’ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇందులో నాగార్జున కూడా కీలక పాత్రలో, హీరోయిన్ గా రష్మిక కనిపించనున్నారు. జూన్ 20, 2025న ఈ సినిమా విడుదల కానుంది.