రజనీకాంత్ కుమార్తెను ప్రేమించి పెళ్లాడిన ధనుష్, ఆ తర్వాత ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ధనుష్‌తో పలువురు హీరోయిన్లకు డేటింగ్ చేస్తున్నారని రూమర్స్ అనూహ్యంగా తెరమీదకు వస్తూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో మృణాల్ ఠాకూర్ తో ధనుష్ ప్రేమాయణం సాగిస్తున్నాడు అనే వార్తలు తెరమీదకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఒక సినిమా ఈవెంట్‌కి హాజరు అవడం, అక్కడ చాలా కన్వీనియెంట్‌గా నడుచుకోవడంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. అయితే, ఆ తర్వాత ఎందుకో ఈ విషయం సైలెంట్ అయింది.
Also Read : Puri – Sethupathi: గుమ్మడి కాయ కొట్టేశారు!
కానీ, కొన్ని నెలల తర్వాత మరోసారి ఈ విషయం తెర మీదకు వచ్చింది. వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాలో చర్చించుకోవడమే ఇప్పుడు దీనికి కారణమైంది. ఈ మధ్యకాలంలో మృణాల్ కొత్త సినిమా అనౌన్స్ చేసింది. దో దివానే షహర్ మే అనే పేరుతో ఒక షార్ట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అది రిలీజ్ చేసిన వెంటనే ధనుష్ “చూడడానికి, వినడానికి కూడా బావుంది” అని కామెంట్ చేశారు. వెంటనే మృణాల్ హార్ట్ సింబల్‌తో రిప్లై ఇచ్చింది. దీనితో మరోసారి వీరిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అనే చర్చ తెరమీదకు వచ్చింది. ఇక ఈ రిప్లైలకు సంబంధించిన స్క్రీన్ షాట్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. తాజాగా ఈ విషయం మీద అటు ధనుష్ గానీ, ఇటు మృణాల్ కానీ స్పందించింది లేదు..