NTV Telugu Site icon

Tirumala: రేపటి నుంచి తిరుమలలో ధనుర్మాసం ప్రారంభం.. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం..

Tirumala

Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దీంతో శ్రీవారి భక్తులు 10 కంపార్టుమెంట్లలో వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. కాగా, నిన్న శ్రీనివాసుడిని 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక, 25, 635 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా.. శ్రీవారి హుండి ఆదాయం 3.89 కోట్ల రూపాయలు వచ్చింది.

Read Also: Shivraj Singh Chauhan : యువకుడి ప్రాణాలు కాపాడిన ముఖ్యమంత్రి

అయితే, తిరుమలలో రేపటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. దీంతో రేపటి నుంచి జనవరి 14వ తేది వరకు శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. నెల రోజులు పాటు సుప్రభాతంకు బదులుగా తిరుప్పావైతో స్వామివారికి మేల్కోలుపు ఉండనుంది. ఇక, 19వ తేదిన శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాదన సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేసింది. ఎల్లుండి సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ పేర్కొనింది.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అలాగే, తిరుమలలో ఈ నెల 23వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో పది రోజులు పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నారు. 22వ తేదిన తిరుపతిలో ఆఫ్ లైన్ విధానంలో సర్వదర్శనం భక్తులకు టోకేన్లు జారీ చేయనున్నారు. రోజుకి 42500 చోప్పున పది రోజులకు 4.25 లక్షల టోకేన్లను టీటీడీ జారీ చెయ్యనుంది. ఇక, ఇవాళ నుంచి తిరుపతి విమానశ్రయాంలో శ్రీవాణి దర్శన టిక్కేట్ల కౌంటర్ మూసివేయనున్నారు. నేటి నుంచి తిరుమలలోని గోకులం అతిథి గృహంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా విమాన ప్రయాణికులకు శ్రీవాణి దర్శన టిక్కేట్లు కేటాయించారు. రోజుకి 100 చోప్పున బోర్డింగ్ పాసులు కలిగిన భక్తులకు టిక్కేట్లను తిరుమల తిరుపతి దేవాస్థానం బోర్డు కేటాయించనుంది.