Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్‌గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Masala Bhindi Recipe: రోజూ ఒకే రకమైన కూరలు తిని బోర్ కొడుతోందా? భోజనానికి రుచిగా, కాస్త కారంగా, హోటల్ స్టైల్‌లో ఏదైనా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే మసాలా భిండి మీకు అద్భుతమైన ఎంపిక. బెండకాయతో చేసే ఈ వంటకం తక్కువ సమయంలో సిద్ధమవుతుంది. రుచిలో మాత్రం ధాబా స్టైల్ టచ్ ఉండడంతో వేడి అన్నం, రోటీ, చపాతీతో ఎంతో బాగుంటుంది. వేసవి కాలంలో బెండకాయ ఎక్కువగా లభించే కూరగాయ. దీనితో వేపుడు, పులుసు, స్టఫ్ కర్రీలు చేస్తారు. కానీ మసాలా భిండి మాత్రం ప్రత్యేక రుచితో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
* బెండకాయలు – 300 గ్రాములు
* టమాటాలు – 1 లేదా 2
* పెద్ద ఉల్లిపాయ – 1
* కారం – అర టీస్పూన్
* జీలకర్ర – 1 టీస్పూన్
* ధనియాల పొడి – 1 టీస్పూన్
* అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
* ఆమ్చూర్ పొడి – పావు టీస్పూన్
* కసూరి మెంతి – అర టీస్పూన్
* చాట్ మసాలా – పావు టీస్పూన్
* గరం మసాలా – పావు టీస్పూన్
* నూనె – అవసరమైనంత
* ఉప్పు – తగినంత
Also Read
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
- YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
తయారీ విధానం
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి పూర్తిగా తుడిచి తేమ లేకుండా చేయాలి. తర్వాత వాటిని నిలువుగా కోయాలి. తేమ ఉంటే బెండకాయలు జిగురుగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బాణలిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక బెండకాయలను వేసి మధ్యస్థ మంటపై స్వల్పంగా వేయించాలి. జిగురు తగ్గి కాస్త మెత్తబడిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టాలి. అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత తరిగిన ఉల్లిపాయలు వేసి లేత గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. ఆపై టమాటా ముక్కలు వేసి బాగా ఉడికించాలి. టమాటా, ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు, ఆమ్చూర్ పొడి వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి మసాలా నూనె వేరుపడే వరకు ఉడికించాలి. ఇప్పుడు ముందుగా వేయించిన బెండకాయలను వేసి మసాలా బాగా పట్టేలా కలపాలి. మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు మధ్యస్థ మంటపై ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరగా కసూరి మెంతి, చాట్ మసాలా చల్లి స్టౌ ఆఫ్ చేయాలి. కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు.
ఎలా సర్వ్ చేయాలి?
ఈ మసాలా భిండి వేడి అన్నంతోనూ, రోటీ, చపాతీ, పూరీతోనూ ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో సింపుల్‌గా చేసుకునే ఈ ధాబా స్టైల్ వంటకం కుటుంబ సభ్యులందరికీ నచ్చుతుంది… మళ్లీ మళ్లీ ఈ వంటకాన్ని అడుగుతారు..
తాజావార్తలు
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!