Telangana DGP Mahender Reddy Say Thanks To Telangana Government.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను నేడు సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం గర్వించేలా తీర్చిదిద్దిన ఈ సీసీస తెలంగాణకే గర్వ కారణమన్నారు. 2014 లో సికింద్రాబాద్ లో జూన్ 2న కేసీఆర్ కమాండ్ కంట్రోల్ ఆలోచన చెప్పారని, పోలీస్ శాఖకు మేం అడగకపోయినా ప్రభుత్వ అధినేతగా ప్రతి సారి పోలీస్ శాఖకి మేలు చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ శాఖకి ఎప్పుడూ అండగా ఉన్నారన్నారు. 8 సంవత్సరాల తెలంగాణ అభివృద్ధిలో పోలీస్ శాఖ కీలక బాధ్యత నిర్వహించిందని, నేను హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో విదేశీ పోలీసింగ్ గురించి తెలుసుకోవాలని సీఎం అక్కడికి పంపించారన్నారు. విదేశాల్లో పోలీసింగ్ విధానంపై పూర్తి అధ్యయనం చేశామని, నేరాలు చేసే వారు కొత్త కొత్త టెక్నాలజీ వాడుతున్నారన్నారు.
వారి కంటే రెండు అడుగులు ముందు గానే మనం ఉండాలని, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ లో వరల్డ్ క్లాస్ సదుపాయాలు ఉన్నాయని, ఈ సీసీసీ నుండి ప్రభుత్వ విభాగాలు సమిష్టిగా పని చేయచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో ఇటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ లేదని, గ్రామాలు, పోలీస్ స్టేషన్ లు, వివిధ విభాగాల కమాండ్ సెంటర్ లు అన్నిటికీ ఈ సీసీసీ హబ్ లాంటిదని ఆయన వెల్లడించారు. పోలీస్ శాఖలో ఉన్న అన్ని విభాగాలతో ఈ సీసీసీను అనుసంధానం చేస్తామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రజలకు భరోసా ఇస్తోందన్నారు. ఇంత మంది సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.