Air India: ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.1.10 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విమానాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని రూట్లలో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపిస్తూ ఒక ఎయిర్‌లైన్ ఉద్యోగి ద్వారా రెగ్యులేటరీకి భద్రతా నివేదిక అందింది. దీంతో తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
Read Also: Suhas: బ్యాండు సౌండ్ మాములుగా లేదు మావా…
అయితే, ఎయిరిండియా కొన్ని సుదూర క్లిష్టమైన మార్గాల్లో నిర్వహించే విమానాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఎయిర్‌లైన్ ఉద్యోగి డీజీపీఏకు కంప్లైంట్ చేసింది. దీంతో టాటా గ్రూప్ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్ ఇండియాపై అందిన ఫిర్యాదుపై డీజీసీఏ విచారణ జరిపినప్పుడు.. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రాథమికంగా తేలిందని నివేదిక పేర్కొంది. దర్యాప్తు నివేదిక ఆధారంగా, రెగ్యులేటర్ ఎయిర్‌లైన్స్ మేనేజ్మెంట్కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.
Also Read
ఇక, విమానాల తయారీ సంస్థ సూచించిన రెగ్యులేటరీ నిబంధనలతో పాటు పనితీరు పరిమితులకు అనుగుణంగా లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణ సరిగ్గా లేనందున డీజీసీఏ ఎన్ఫోర్స్మెంట్ చర్యలు తీసుకుని ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు ప్రకటించింది. ఇటీవల, DGCA ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు 1.20 కోట్ల రూపాయల జరిమానా విధించింది.. ఎందుకంటే దాని విమానాలలో ఒకదానిలోని ప్రయాణీకులు రన్‌వే రోడ్‌పై ఆహారం తినడంతో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు.
తాజావార్తలు
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్‌వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..