NTV Telugu Site icon

Air India: ఎయిర్ ఇండియాకు డీజీసీఏ రూ.1.10 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?

Air India

Air India

విమానాల్లో అనేక అవకతవకలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.1.10 కోట్ల భారీ జరిమానా విధించింది. కొన్ని రూట్లలో భద్రతా ఉల్లంఘనలు జరిగినట్లు ఆరోపిస్తూ ఒక ఎయిర్‌లైన్ ఉద్యోగి ద్వారా రెగ్యులేటరీకి భద్రతా నివేదిక అందింది. దీంతో తగిన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

Read Also: Suhas: బ్యాండు సౌండ్ మాములుగా లేదు మావా…
అయితే, ఎయిరిండియా కొన్ని సుదూర క్లిష్టమైన మార్గాల్లో నిర్వహించే విమానాల్లో భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ ఎయిర్‌లైన్ ఉద్యోగి డీజీపీఏకు కంప్లైంట్ చేసింది. దీంతో టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో నడిచే ఎయిర్‌ ఇండియాపై అందిన ఫిర్యాదుపై డీజీసీఏ విచారణ జరిపినప్పుడు.. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రాథమికంగా తేలిందని నివేదిక పేర్కొంది. దర్యాప్తు నివేదిక ఆధారంగా, రెగ్యులేటర్ ఎయిర్‌లైన్స్ మేనేజ్‌మెంట్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసింది.

Read Also: Uppal Test: ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి.. వాటికి మాత్రం నో పర్మిషన్: రాచకొండ సీపీ

ఇక, విమానాల తయారీ సంస్థ సూచించిన రెగ్యులేటరీ నిబంధనలతో పాటు పనితీరు పరిమితులకు అనుగుణంగా లీజుకు తీసుకున్న విమానాల నిర్వహణ సరిగ్గా లేనందున డీజీసీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు తీసుకుని ఎయిర్ ఇండియాపై రూ. 1.10 కోట్ల జరిమానా విధించినట్లు ప్రకటించింది. ఇటీవల, DGCA ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు 1.20 కోట్ల రూపాయల జరిమానా విధించింది.. ఎందుకంటే దాని విమానాలలో ఒకదానిలోని ప్రయాణీకులు రన్‌వే రోడ్‌పై ఆహారం తినడంతో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తీవ్రంగా మండిపడ్డారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటివి ఆమోదయోగ్యం కాదన్నారు.