Site icon NTV Telugu

Ram Mandir: రామ్లల్లా దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తొలి రోజు ఎంతమంది దర్శించుకున్నారంటే..!

Darshan

Darshan

బాలరాముడి ప్రాణప్రతిష్ట జరిగిన మరుసటి రోజే అయోధ్యకు భారీగా భక్తులు పోటెత్తారు. అయితే మంగళవారం నుంచి సామాన్య భక్తులకు అనుమతిస్తుండటంతో లక్షలాది భక్తులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో అయోధ్య మొత్తం కిక్కిరిసిపోయింది. కాగా.. ఈరోజు రెండున్నర నుండి మూడు లక్షల మంది భక్తులు రాముడిని దర్శించుకున్నట్లు ఆలయ ట్రస్ట్ అంచనా వేస్తోంది. అంతేకాకుండా.. రాముడిని దర్శించుకునే భక్తులు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

Read Also: Bharat Ratna: దివంగత బీహార్‌ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్‌కు భారతరత్న..

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం అయోధ్యలో రామమందిర ఏర్పాట్లను పరిశీలించారు. హెలికాఫ్టర్‌లో రామమందిరం ప్రాంతంలో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాగా.. రెండు దఫాలుగా భక్తులను అనుమతిస్తుండగా.. వారిని నియంత్రించడం పోలీసులకు సవాల్ గా మారింది. భక్తుల రద్దీ నేపథ్యంలో 8 వేల మంది పోలీసులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Read Also: General Elections: ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు.. క్లారిటీ ఇచ్చిన ఈసీ

డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోం) సంజయ్ ప్రసాద్ స్వయంగా ఆలయంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలా ఉంటే.. అయోధ్యకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న క్రమంలో రోడ్లన్నీ నిండిపోయాయి. దీంతో 30 కి.మీ దూరాన వాహనాలను ఆపేస్తున్నారు. అక్కడి నుంచి కాలినడకన అయోధ్య రామ మందిరానికి చేరుకుంటున్నారు.

Exit mobile version