NTV Telugu Site icon

Mantralayam: భక్తులతో కిక్కిరిసిన మంత్రాలయం.. తప్పని ఇక్కట్లు

Mantralayam

Mantralayam

Mantralayam: సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో పట్నం ఖాళీ అయిపోయింది అంతా పల్లె బాట పట్టారు.. దీంతో.. గ్రామాలు సందడిగా మారాయి.. మరోవైపు.. వరుస సెలవుల నేపథ్యంలో మరికొందరు పుణ్యక్షేత్రాల బాట పట్టారు.. దీంతో.. ఆలయాలు రద్దీగా మారుతున్నాయి.. వరుస సెలవులతో గత రెండు రోజులగా మంత్రాలయానికి భక్తులు భారీగా పోటెత్తారు.. భక్తులతో మంత్రాలయం కిక్కిరిసిపోయింది.. వసతి గృహాలు దొరక్క భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్‌ వ్యక్తులు చెలరేగిపోతున్నారు.. ప్రైవేటు లాడ్జీలకు పార్కింగ్ స్థలం లేక రోడ్లుపై వాహనాలు పార్క్‌ చేస్తున్నారు.. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Read Also: Naa Saami Ranga Day 1 collections : దిమ్మతిరిగే కలెక్షన్స్ ను అందుకున్న ‘నా సామిరంగ’.. ఫస్ట్ డే ఎన్ని కోట్లంటే?

మరోవైపు.. ప్రైవేటు వసతి గృహాలు అధిక రేట్లు పెంచి భక్తులను నిలువ దోపిడి చేస్తున్నాయి.. 8 గంటల విడదికి రూ. 8 వేలు నుండి రూ.10 వేలు వరకు లాడ్జీల రేట్లు పెంచి నిర్వహకులు భక్తులను నిలువ దోపిడి చేస్తున్నారు. భక్తులు ప్రశ్నిస్తే లాడ్జి తీసుకుంటావా? వెళ్లి పోతావా? అని బెదిరింపులకు దిగుతున్నారు నిర్వాహకులు.. రాజకీయ నాయకుల అండదండలతో నిర్వహకులు రెచ్చి పోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తులు పిల్ల పాపలతో ఇబ్బందులు పడుతున్న పట్టించుకోని రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదని భక్తులు మండిపడుతున్నారు.. లాడ్జీలుకు కమిటీ కాని , యూనియన్ లేక పోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధ్యాత్మిక క్షేత్నాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు లాడ్జీల నిర్వహకులు. అధికారులు చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు భక్తులు.