Site icon NTV Telugu

Devineni Avinash: రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా మారుతున్నాయి.. దేవినేని అవినాష్ ఘాటు వ్యాఖ్యలు..!

Devineni Avinash

Devineni Avinash

Devineni Avinash: ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది గడుస్తున్నా, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్బంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉండాల్సింది. కానీ, అవి కేవలం ఓటు కోసం చెప్పిన వాగ్దానాలుగానే మిగిలిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో వైస్సార్సీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమం ద్వారా ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తుంటే, దాన్ని దారి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.

Read Also: Minister Kishan Reddy: అవినీతి రహిత పాలనకు నిదర్శన ప్రధాని మోడీ ప్రభుత్వం..!

ఒక మీడియా చానెల్‌లో చేసిన వ్యాఖ్యల్ని, జగన్ కుటుంబానికి అన్యాయంగా సంబంధపెట్టి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌ను అరెస్ట్ చేయడం కక్ష పూరిత రాజకీయాల పరాకాష్ఠ అని పేర్కొన్నారు. వైస్సార్సీపీ హయంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు. జగన్ పాలనలో మహిళల పేరుతో పథకాలు ప్రారంభించి, వాటిని విజయవంతంగా అమలు చేశాం. మహిళలకు గౌరవంగా, రక్షణగా మారిన పరిపాలన అందించామని అన్నారు. వైఎస్ భారతి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, మేము ఎప్పుడూ బయటకు చెప్పలేదుని వ్యాఖ్యానించారు.

Read Also: Sonam Raghuwanshi: మే 23న సోనమ్‌కు అత్త ఫోన్ కాల్.. రాజా గురించి అడిగితే ఏం సమాధానం చెప్పిందంటే..!

Exit mobile version